


తేది:28-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS వెంకటాపురం గ్రామం రిపోర్టర్ ఆరట్ల రుక్మయ్య.
సంగారెడ్డిజిల్లా: సదాశివపేట పట్టణంలో అయ్యప్ప మందిర ఆలయ కమిటీ చైర్మన్ గోన శంకర్ గురుస్వామి మరియు ఆరే సుధాకర్ గురు స్వామి తనయుడు కుమారుడు రమణ కిరణ్ దుద్దాగి మన తెలుగు సంఘం అధ్యక్షులు సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్యా హాస్పిటల్ వారిచే ఫ్రీ ఫ్రీ మేఘ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ యొక్క వైద్య సేవలను సదాశివ పట్టణ ప్రజలు మండల ప్రజలు వైటెల్స్ చెకప్, బ్లడ్ ప్రెషర్, బిఎంఐ, డయాబెటిస్, న్యూరో, సర్జన్ గైనకాలజిస్ట్, ఎమర్జెన్సీ కేర్, సేవలు తండోపతండాలుగా ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఇట్టి విషయంలో అయ్యప్ప ఆలయ కమిటీ వారు మరియు సదాశివపేట పట్టణ ప్రజలు మన తెలుగు సంఘం అధ్యక్షుల వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి సేవలను గ్రామస్థాయిలో తీసుకువెళ్లి నిరుపేదలకు అందించాలని కోరారు అదేవిధంగా ఇంకా మెరుగైన సౌకర్యంతో ముందు ముందు ఇలాంటి ఫ్రీ ఫ్రీ మెగా వైద్య శిబిర క్యాంపులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సదాశివపేట పట్టణ అయ్యప్ప ఆలయ కమిటీ వారు,భక్తులు మరియు సదాశివపేట పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.