కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సామాజిక–ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ నేత.

తేది: 27-12-2025 మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా TSLAWNEWS కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ మల్లికార్జున్ బెస్త.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 131 కుత్బుల్లాపూర్ డివిజన్‌లో, చింతల్ మెయిన్ రోడ్‌లోని రిచ్ టవర్స్ వద్ద శ్రీ వీర మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిర కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు.
అనంతరం భరత్ సింహ రెడ్డి శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అదేవిధంగా 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో, సంతోష్ స్వామి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల సందర్భంగా భరత్ సింహ రెడ్డి మాట్లాడుతూ, సమాజ సేవతో పాటు ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడం తమ లక్ష్యమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *