
తేదీ 27-12-2025 TSLAW NEWS మెదక్ జిల్లా హవేలి ఘన్‌పూర్ రిపోర్టర్ తలారి బాలయ్య.
మెదక్ జిల్లా : హవేలీ ఘనపూర్ మండలంలోని రాజుపేట గ్రామంలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేక మహోత్సవం పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో గౌరవ మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పిట్టలా రాములు, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ గోపాల్ రావు, మాజీ సర్పంచ్ యామీ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాయి గౌడ్, మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సిద్ధిరాంరెడ్డి, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు ఆంజనేయులు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తితో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుని, భక్తుల మనసులను ఆనందంతో నింపింది.