తేదీ:27-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గము కోఆర్డినేటర్ మహేందర్.
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు నియోజకవర్గం, జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నిర్మిస్తున్న జీవనజ్యోతి జ్యోతిర్లింగం శివాలయం అభివృద్ధికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి భారీ విరాళం అందించి మరో మారు తన దైవభక్తి చాటుకున్నారు. శనివారం ఉదయం స్థానిక నాయకులు, గ్రామ పుర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దేవాలయం అభివృద్ధి కోసం 16 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. దేవాలయం నిర్మాణ అంశంలో ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా సొంత నిధులచే ఇప్పటివరకు 200 పైగా దేవాలయాలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ నిర్మించబోతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరిలో పరమతసహనం పొందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. శివ భక్తుల విజ్ఞప్తి మేరకు ఆలయం పరిధిలో సన్నిధానం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ సమీపంలో గల డంపు యార్డును వేరే స్థలానికి మార్చాలని మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అనంతరం జిన్నారంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం కోసం ఒక లక్ష 50 వేల రూపాయల విరాళాన్ని గ్రామస్తులకు అందజేశారు.