
తేదీ 25-12-2025, జనగామ జిల్లా,TSLAWNEWS ,పాలకుర్తి మండల రిపోర్టర్ , Maroju Bhaasker.
జనగామ జిల్లా: శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ఈనెల 31న బుధవారం ఉదయం 11గంటలకు కొబ్బరి కాయలు, పూజా సామగ్రి అమ్ముకునే హక్క కోసం ( అభిషేకము పూజా సామాగ్రి మినహాయించి) మరియు దేవస్థానమునకు వాహన పూజ సామాగ్రి సప్లై చేయు లైసెన్స్,తల నీలాలు పోగు చేసుకునే హక్కు లైసెన్స్ కోసం సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహిస్తు న్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న గురువారం ఒక ప్రకటనలతో తెలిపారు. పాల్గొనేవారు ఈనెల 30న సాయం త్రం 5 గంటల లోపు దేవస్థాన కార్యాలయంలో రూ.1000 చెల్లించి టెండర్ షెడ్యూల్ పొందాలని కోరారు.