


తేదీ:24-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS
గణపురం మండలం రిపోర్టర్ దీపక్.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎంజీఎం హైస్కూల్ నందు ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సి.ఎస్.ఐ హోలీ మాన్యువల్ చర్చ్ విశ్వాసకులు, యేసు క్రీస్తు ఆరాధకులు విద్యార్థిని, విద్యార్థుల చేత పాటలు, నృత్యాలు చేయించి ప్రీ ప్రైమరీ చిన్నారులు శాంతా క్లాజ్ , మేరీ మాత వేషధారణలతో వివిధ ప్రదర్శనలు నిర్వహించి, కోలాహలం చేస్తూ ఆద్యంతం అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ కుల, మత ,ప్రాంత ,జాతీయతకు క్రీస్తు జన్మదినం ఒక ప్రతీక అని ప్రపంచ దేశాలు ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ క్రిస్మస్ అని తెలియజేశారు. అనంతరం నిర్వాహకులు డైరెక్టర్లతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు ,చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి ,సిలువేరు శ్రీనివాస్ ,ప్రిన్సిపల్ మధుకర్, యేసు ప్రభు విశ్వాసకులు కావ్య,శ్రీవిద్య , ఝాన్సీ తో పాటు మిగతా ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు