హిందువుల ఆలయాల జోలికి వస్తే ఉరికిచ్చి కొట్టుడే. హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్ద,అక్రమ నిర్మాణాలు వదిలేసి ఆలయాల మీద పడ్డారు. వరంగల్ లో ఇలాంటి చర్యలను సహించేది లేదు-బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్.

తేది:24-12- 2025  TSLAWNEWS  వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లాలో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఉరికిచ్చిఉరికిచ్చి కొడుతామని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హెచ్చరించారు. పైడిపెల్లిలో మైసమ్మ ఆలయం కూల్చివేతపై ఆయన బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం మైసమ్మ ఆలయం పరిశీలించి అక్కడి గ్రామస్తులకు స్థానిక ప్రజలకు తిరిగి గుడి నిర్మాణం చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం GWMC కమిషనర్ కు వినతి పత్రం సమర్పించి అక్కడ జరిగిన వాస్తవాలను వివరించి గుడి కూల్చివేత పై అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కార్పొరేషన్ నిధులతోనే ఆలయ పునఃనిర్మాణం తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్ మాట్లాడుతూ చారిత్రక ఓరుగల్లు నగరంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు, కట్టడాలు నాలా కబ్జాలను పట్టించుకోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మైసమ్మ ఆలయాన్ని కూల్చడంలో మాత్రం అత్యుత్సాహన్ని చూపించారని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై వారిచ్చే సొమ్ముకు ఆశపడి పోలీసుల సాయంతో గుడిని కూల్చివేశారని మండిపడ్డారు.
ఆలయ నిర్మాణం రోడ్డు పక్కనే ఉన్నా, కుడా లే ఔట్ల కూడా ఉన్నా కుట్ర చేసి కూల్చారని ఫైర్ అయ్యారు. ఓరుగల్లులో ఇలా హిందువుల మనోభావాలు దెబ్బతీసే చర్యలును ఉపక్షించమని, ఒక మతాన్ని అంటిపెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దని సూచించారు. భవిష్యత్ లో ఇలాంటి దాడులకు పాల్పడితే ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతామని గంట రవికుమార్ హెచ్చరించారు.
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సోయిలేదా..?
గ్రేటర్ పరిధిలో ఎన్నో అక్రమ నిర్మాణాలు రోజుకొకటి పుట్టగొడుగుల్ల పుట్టుకస్తున్నాయి, నాలాల కబ్జాలు జరుగుతున్నాయని, రోడ్లపై దర్గాలు కడుతున్నారని అవి కార్పొరేషన్ అధికారులకు కనిపించడం లేదా అని గంట రవికుమార్ ప్రశ్నించారు. రోడ్ల పక్కన ఉన్న హిందు దేవాలయాలే కనిపిస్తున్నాయా అంటూ ఫైర్ అయ్యారు. కార్పొరేషన్ శాఖ అధికారులంతా ఒకసారి ఆలోచన చేయాలని మీరు హిందువులు కాదా అని ప్రశ్నించారు. మీ ఆలోచన విధానం మార్చుకోకపోతే హిందువుల నుంచి దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు, బిజెపి శ్రేణులు, పైడిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *