రణ్వీర్ సింగ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘ధురంధర్’ మూవీ మూడో శనివారం (16వ రోజు) సరికొత్త చరిత్ర సృష్టించింది. గత 8 ఏళ్లుగా ఎవరూ టచ్ చేయలేకపోయిన దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి 2’ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది. భారత బాక్సాఫీస్ చరిత్రలో 16వ రోజు అత్యధికంగా ₹36 కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా ‘బాహుబలి 2’ రికార్డు ఉండగా, ‘ధురంధర్’ ఏకంగా ₹39 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఆ రికార్డును అధిగమించి సరికొత్త ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పింది.
వసూళ్ల పరంగా ఈ చిత్రం ఇప్పటికే ₹790.75 కోట్లను దాటేసింది. నేటితో ఈ మూవీ ₹800 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం ఇండియాలోనే ఈ సినిమా ఇప్పటి వరకు ₹555.5 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో గత ఏడాది సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘యానిమల్’ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను (₹553 కోట్లు) ‘ధురంధర్’ కేవలం 16 రోజుల్లోనే దాటేయడం విశేషం.
ఈ స్థాయి వసూళ్లు చూస్తుంటే రణ్వీర్ సింగ్ మాస్ పవర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. కేవలం హిందీ బెల్ట్ లోనే కాకుండా, సౌత్ ఇండియాలో కూడా ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, రణ్వీర్ నటన ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. మరిన్ని వారాల పాటు ఈ జోరు కొనసాగితే భారతీయ సినిమాల్లో టాప్ 5 కలెక్షన్ల జాబితాలోకి ఈ సినిమా చేరడం ఖాయంగా కనిపిస్తోంది.