
తేదీ:21-12-2025, TSLAWNEWS, జనగామ జిల్లా, పాలకుర్తి మండల రిపోర్టర్, Maroju Bhaasker.
తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా అన్నారు. ఆదివారం జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలో ఎన్ఐఏ పోలీసులు గాదె ఇన్నయ్యను అరెస్టు చేయడం, ఆయనపై అక్రమ కేసులు పెట్టడాన్ని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను భౌతికంగా నిర్మూలిస్తుందని, మావోయిస్టులు చర్చలకు సిద్ధపడినప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా లేదని, ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకిస్తున్న మేధావులపై, ప్రజాస్వామిక వాదులపై కక్షపూరిత వేధింపులకు ప్రభుత్వం పాల్పడుతుందని ఆయన విమర్శించారు. అందులో భాగంగానే గాదె ఇన్నయ్యపై కేసులు బనాయించారని, వెంటనే కేసులను ఉపసంహరించుకొని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.