
తేది:15-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో రథయాత్ర చేస్తూ 15-12-2025 సోమవారం రోజున జగిత్యాల జిల్లాలోని వివిధ పిరమిడ్ ధ్యాన సెంటర్లకు పత్రీజీ ధ్యాన జ్యోతి విచ్చేసింది. జగిత్యాలలోని బీట్ బజార్లో గల మెర్కబా పిరమిడ్ కు పత్రీజీ ధ్యాన జ్యోతి వచ్చింది. జగిత్యాలలోని వివిధ ప్రాంతాల్లో గల పిరమిడ్ ధ్యాన సెంటర్లలకు వెళ్ళిందని తెలిపారు. జిల్లాలోని నూకపల్లి, కోరుట్ల, మెట్పల్లి, పైడిమడుగు మొదలైన పిరమిడ్ ధ్యాన సెంటర్లలకు పత్రీజీ ధ్యాన జ్యోతి వెళ్ళిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ పుల్లా రాజేష్,రాజశేఖర్ ,జిల్లా అధ్యక్షుడు ముక్కా సత్యనారాయణ, కార్యదర్శి రమేష్, సంజయ్ రెడ్డి, లక్ష్మి, లక్ష్మణ్, జిల్లాకు చెందిన పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు