రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాజమండ్రి అర్బన్‌ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా షీముషి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్‌దేవ్ శర్మకు పోస్టింగ్ ఇచ్చారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని నారాయణ్‌ నాయక్‌ను ఆదేశించారు. ఆక్టోపస్ ఎస్పీగా కోయ ప్రవీణ్‌, ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్‌ కమాండెంట్‌గా విక్రాంత్‌పాటిల్, డీజీపీ ఆఫీస్‌లో ఏఐజీగా ఆర్‌ఎం అమ్మిరెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు.

ఇక ప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్, విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్‌దేవ్‌ సింగ్, మంగళగిరి బెటాలియన్‌ కమాండెంట్‌గా అజిత వేజేండ్ల, కాకినాడ బెటాలియన్‌ కమాండెంట్‌గా జీఎస్‌ సునీల్, విశాఖ డీసీపీ-1 గా గౌతమి శాలి, ఇంటిలిజెన్స్‌ ఎస్పీగా వకుల్‌ జిందాల్‌కు పోస్టింగ్ ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *