పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ షూటింగ్ షూరు అయ్యింది. రామాయణం ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో రూపొందుతోంది. ప్రభాస్‌కి జోడీగా కృతిసనన్ నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘రాధేశ్యామ్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓ రౌత్ తో సినిమా చేస్తున్నాడు ప్రభాస్.
రామాయణం ఆధారంగా ఆదిపురుష్ తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని మొదటినుంచి టాక్ వినిపిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ‘ఆదిపురుష్’ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో రూపొందుతోంది. కరోనా కారణంగా ఆగిన అగ్రతార చిత్రాలు వరుసగా పున:ప్రారంభం అవుతున్నాయి.