మూడవ దశ ట్రయల్ అనంతరం కరోనా వైరస్కు వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఆక్సఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. 2020 సెప్టెంబరు, డిసెంబరు మధ్య కాలం నాటికి తొలి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బ్రిటన్ చీఫ్ సైంటిఫిక్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ వివరించారు. ఈ నెలాఖరు నుంచి సెప్టెంబర్ వరకు 500 మంది వాలంటీర్లపై పరిశోధనలు నిర్వహించిన అనంతరం కచ్చితమైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. కనీసం 2021 ప్రారంభంనాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసుగల వాలంటీర్లు తమపై పరిశోధనకు ముందుకొచ్చారని, ఇవి విజయవంతమైతే వ్యాక్సిన్ అనుకున్న దానికంటే ముందుగానే అందుబాటులోకి వస్తుందన్నారు.