తెలంగాణలో గురువారం (జూలై 1) నుంచి పాఠశాలలు ప్రారంభం

 

తెలంగాణలో గురువారం (జూలై 1) నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ఆన్‌లైన్ క్లాసులు జరగనున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది విద్యాశాఖ. కరోనా ఉధృతి తగ్గేంత వరకు KG టు PG విద్యార్థులకు ఆన్‌లైన్‌ విధానంలోనే క్లాసులు నిర్వహిస్తారు. దీంతో వేసవి సెలవులు ముగిసిన తరువాత విద్యార్థులంతా మళ్ళీ ఆన్‌లైన్‌ క్లాసులకు రెడీ అవుతున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌లోనే విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల విద్యార్థులకు గత ఏడాది లాగానే ఆన్‌లైన్‌లో క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రతి విద్యార్థి టీశాట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు విద్యాశాఖ అధికారులు.. ప్రతి విద్యార్థి ఆన్ లైన్ తరగతులకు హాజరయ్యే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు.. విద్యార్థులతో మాట్లాడి కావాల్సిన సహాయం చేయాలని టీచర్లు, స్కూల్ హెడ్‌ మాస్టర్లకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఏడాది కూడా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్ తరగతులు ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు సబ్జెక్టుకు 30 నిమిషాల చొప్పున క్లాసులు డీడీ యాదగిరి, టీశాట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అవసరమైతే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఉపాధ్యాయులు మాట్లాడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. టీవీలు ఉండి ప్రసారాలు రానిచోట కలెక్టర్లు స్థానిక కేబుల్‌ ఆపరేటర్లను సంప్రదించి ప్రసారమయ్యేలా చూడాలంది ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో 3 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య 16 లక్షలకు పైగా ఉంది..

మరో పది లక్షల మంది ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు.. ఇప్పటికే టీ శాట్ యాప్‌ను 10లక్షలకు పైగా మంది విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రతి రోజూ విద్యార్థులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు ఉంటాయన్నారు ఇప్పటికే 50శాతం మంది ఉపాధ్యాయులు ప్రతిరోజు స్కూళ్లకు హాజరవుతున్నారు.. వీరంతా విద్యార్థులతో వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్ చేసి.. క్లాసులు వింటున్నారా? లేదా? పర్యవేక్షించడమే గాకుండా.. వర్క్‌ షీట్స్‌ ఇచ్చి వారితో హోమ్‌ వర్క్‌ చేయించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *