కరోనా రక్కసి కోరల్లో చిక్కుకున్న అగ్రరాజ్యం అమెరికా మృతుల్లో మొదటి స్థానానికి చేరుకుంది. రోజూ రెండు వేలకు పైగా మరణాలు నమోదవుతున్న వేళ కోవిడ్ మృతుల్లో ఇటలీతో పోటీపడుతూ వస్తున్న యూఎస్ శనివారం రాత్రి అందిన లెక్కల మేరకు 20 వేల 506 మృతులతో తొలి స్థానంలో నిలిచింది. వైరస్ బారినపడ్డ లెక్కల్లోనూ అమెరికా 5,27,111 కేసులతో తొలిస్థానంలో ఉంది. ఇక యూరప్ దేశాల్లో కోవిడ్ దెబ్బకు ఎక్కువగా బలి అవుతున్న ఇటలీ 19,468 మరణాలతో రెండో స్థానంలో ఉంది. అయితే, జనాభా పరంగా యూఎస్‌తో పోల్చుకుంటే ఇటలీ ఐదు రెట్లు చిన్నది కావడం గమనార్హం.