మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్ భానుప్రకాశ్‌పై తాళ్లపల్లి తండా రైతులు డీజిల్ పోశారు. సోమవారం తాళ్లపల్లి తండాలో రైతు మాలోత్ బాలు విద్యుదాఘాతంతో మృతిచెందారు. తహసీల్దార్ సకాలంలో పట్టా పాసుపుస్తకాలు ఇవ్వలేదని.. ఈ కారణంగానే మాలోత్ బాలుకు బీమా రాలేదని రైతులు ఆరోపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తహసీల్దార్‌పై డీజిల్ పోశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. మాలోత్ బాలు కుటుంబానికి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.