తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగులకు భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ధర్నా చేపట్టింది. ఇందులో భాగంగా టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించింది. భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ వరకు ర్యాలీగా వచ్చిన బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట నెలకొని ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.