సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌‌పై ఏపీ ప్రభుత్వం వేటు..

ఎట్టకేలకు సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేసింది చంద్రబాబు సర్కార్. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే ఫిర్యాదు వచ్చింది. దీనిపై అధికారులు డిపార్టెమెంట్ విచారణ చేపట్టింది. సర్కారు ఆదేశాలను తిరస్కరించారని తేలింది.

 

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది కూటమి సర్కార్. వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్‌ సమయంలో హెడ్‌క్వార్టర్స్‌ వదిలి వెళ్లొద్దని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో ఉంది. 2020-24 మధ్య ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆలిండియా సర్వీసు నిబంధనలను ఆయన ఉల్లంఘించినట్టు తేలింది. గతంలో దీనిపై రెవిన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

 

ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశాల్లో పర్యటించారని సునీల్ కుమార్‌పై అభియోగాలు న్నాయి. ఈ విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించినట్టు ఫిర్యాదు వచ్చాయి. వీటిపై లోతుగా విచారణ చేస్తోంది. గల్ఫ్, జార్జియా పర్యటనకు ప్రభుత్వం అనుమతులు తీసుకున్నప్పటికీ ట్రావెల్ ప్లాన్ కు విరుద్ధంగా ఆయన వ్యవహరించినట్టు సమాచారం. మరోవైపు స్వీడన్, అమెరికా, గల్ఫ్ అనుమతులు ల్లేకుండా సునీల్‌కుమార్ పర్యటించారు.

 

మరోవైపు సునీల్ కుమార్‌పై గతంలో పలు ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ అధినేతగా ఉన్న సమయంలో అప్పటి నరసాపురం ఎంపీ, ప్రసుత్త ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి ధృవీకరించిన విషయం తెల్సిందే.

 

ముంబై నటి జత్వానీ కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు పడింది ఏపీ ప్రభుత్వం. వారిలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే. తాజాగా సునీల్‌కుమార్ నాలుగో అధికారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *