దేశ వ్యాప్తంగా 130 కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్

కేంద్రం చేస్తున్న వాటికి మీ పబ్లిసిటీ ఏంటి
వ్యాక్సిన్ పై కేసీఆర్ తీరు ఎలా ఉందంటే సొమ్ము ఒకరిదిసోకు ఒకరిది అన్నట్టు ఉంది

ఈరోజుజోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లో కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ ఫ్లోర్లీడర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏవో.లక్ష్మి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది..

గత నాలుగు రోజులుగా మున్సిపాలిటీ మరియు ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న టువంటి సూపర్ స్పైడర్ మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో గద్వాల మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రజలకు ఇస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటో మాత్రమే ఉన్నది. కానీ ఈ వ్యాక్సినేషన్ పక్రియ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి ఫోటో ఉండకపోవడం తో తగు
చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది .ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కుమ్మరి శ్రీనివాసులు, త్యాగరాజు , రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు నెమలికంటి రామాంజి ,జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు తరుణ్, పట్టణ ఉపాధ్యక్షుడు పాండు,రాజు తదితరులు ఉన్నారు..*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *