తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేశారంటూ మండిపడ్డా అనుపమ పరమేశ్వరన్‌

 తన సోషల్‌ మీడియా అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేశారంటూ హీరోయిన్‌  అనుపమ పరమేశ్వరన్‌ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమల్లో నటించిన ఈ కేరళ కుట్టి కొద్ది కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ల జాబితాలో చేరారు. ఇక అనుపమ సోషల్‌ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండరనే విషయం అందరికి తెలిసినదే. ఎప్పుడూ దక్షిణ సంప్రాదాయ దుస్తుల్లో ఉండే అనుపమ ఈ మధ్య కాస్తా జీన్స్‌, టిషర్ట్స్‌ ధరించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతేగాక ఫేస్‌బుక్‌లో తరచూ ఫొటోలు షేర్‌ చేస్తూ.. ఈ భామ కాస్తా యాక్టివ్‌గా ఉండటం చూసి ఆమె అభిమానులు షాకవుతున్నారు. ఎప్పుడూ చీరలో, చుడీదార్‌ వంటి సంప్రాదాయ దుస్తుల్లో మెరిసే తమ అభిమాన హీరోయిన్‌ను.. ఇలా వెస్టర్న్‌ వేర్‌లో చూసి అభిమానుల్లో కొంతమంది మండిపడుతుంటే.. మరికొందరు బాగుందంటూ మురిసిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *