టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఒకవైపు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్న సరే.. ఈ అమ్మడు మాత్రం తన స్నేహితుడైన కీచులోని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అంతేకాదు సినిమాలకి కాస్త గ్యాప్ తీసుకొని ఓ బిడ్డకు తళ్లయింది కూడా.. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఈ క్రమంలో తాజాగా కాజల్ అగర్వాల్ విడాకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హాట్ చర్చగా మారింది. అసలు కాజల్ ఎందుకు విడాకుల గురించి మాట్లాడింది? తన భర్తతో విడాకులు తీసుకునే ఆలోచన ఉందా? అసలేం జరిగింది అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
తెలుగు ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ పేరు సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కాలంలో కాజల్ అగర్వాల్ కాస్త స్లిమ్ అవ్వడంతో పాటుగా వరుసగా అవకాశాలను అందుకుంటూ బిజీగా మారింది. అయితే ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా విడాకులు గురించి మాట్లాడడం అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సడన్గా కాజలు విడాకుల గురించి ఎందుకు మాట్లాడింది అంటూ నెటిజన్లు గుసగుసలు మొదలుపెట్టారు. అసలు కాజల్ కి ఏమైంది ఎందుకు ఇలా కామెంట్స్ చేసింది అని చర్చ జరుగుతుంది.. కొంపతీసి తన భర్తతో విడాకులు తీసుకుంటుందా? లేదా ఈ మధ్య సమాజంలో విడాకుల తంతు ఎక్కువ అవడం వల్లే ఇలా కామెంట్ చేసిందా అన్నది క్లారిటీ రావాలి అంటే కాజల్అగర్వాల్ ఈ విడాకుల కామెంట్స్ పై రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
కాజల్ అగర్వాల్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మధ్యకాలంలో విడాకులు పెరిగిపోతున్నాయి కాబట్టి వాటికి కారణమేంటి అని తాను ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పింది. ప్రస్తుత కాలంలో విడాకులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి కాబట్టి అందుకు కారణం ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఎక్కువగా ఫోన్లోనే ఉండిపోవడమే అంటూ సింపుల్ గా సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్లే విడాకులు సంఖ్య పెరుగుతుంది అంటూ కాజల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాజల్ అగర్వాల్ తన భర్తతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తానని కూడా చెప్పడం ఆసక్తికరంగా మారింది. సడన్ గా విడాకుల గురించి ఎందుకు ఈమె ప్రస్తావించింది అన్న అనుమానాలు మాత్రం ఫాన్స్ లో మొదలవుతున్నాయి. ఏది ఏమైనా కూడా కాజల్ చెప్పిందంట్లో నిజమనే ఉంది అంటూ మరికొందరు తనకు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ సినిమాలు విషయానికి వస్తే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి అని తెలుస్తుంది.