సోషల్ మీడియా వచ్చాకా.. ఎవరు నిజం మాట్లాడుతున్నారో.. ఎవరు అబద్దం చెప్తున్నారో తెలియకుండాపోయింది. ఎవరో ఏదో ఒక మాట అంటే.. దాన్ని వైరల్ గా మర్చి అది నిజమా.. ? అబద్దమా.. ? అనేది కూడా చెక్ చేయకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. నేటి ఉదయం నుంచి.. రామ్ చరణ్, అల్లు అర్జున్ ను ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో అయ్యినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అల్లు – మెగా మధ్య ఉన్న విభేదాలను ఈ అన్ ఫాలో గొడవ మరింత పీక్స్ కు తీసుకెళ్లింది.
ఎప్పటి నుంచో బన్నీకి, చరణ్ కు పడడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తో చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. తాను కూడా గ్లోబల్ గా మంచి పేరు తెచ్చుకోవాలని బన్నీ.. మూడేళ్లు కష్టపడి పుష్ప 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. తన కష్టానికి ప్రతిఫలం బాగానే వచ్చింది కానీ.. బన్నీనోటిదూల వలన కొన్ని.. ఆయన చేసిన పనుల వలన మరికొన్ని వివాదాలు మెడకు చుట్టుకున్నాయి.
ఇక ఇవన్నీ బన్నీ.. మెగా కాంపౌండ్ నుంచి దూరం కావడానికి చేస్తున్న ప్రయత్నాలే అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. గతేడాది ఎన్నికల సమయంలో బన్నీ చేసిన పనికి మెగా మేనల్లుడు.. బన్నీని అన్ ఫాలో చేశాడు. ఇక ఇప్పుడు చరణ్ చేసారని చెప్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. చరణ్- బన్నీ ఎప్పుడు ఫాలో అయ్యింది లేదు. చరణ్ ఇన్స్టాగ్రామ్ లో 38 మందిని ఫాలో అవుతున్నాడు. అందులో అల్లు శిరీష్ కూడా ఉన్నాడు కానీ, బన్నీ లేడు అనేది కొందరి మాట.
సరే ఇప్పుడే అన్ ఫాలో అయ్యాడు అనుకుంటే.. ఒకప్పుడు ఫాలో అయ్యాడు అనడానికి ఫ్రూప్స్ లేవు. దీంతో ఇదంతా ఫేక్ అని అంటున్నారు మెగా ఫ్యాన్స్. అసలు ఫాలోనే కానీ.. చరణ్, బన్నీలను కావాలనే ఫ్యాన్ వార్స్ పెట్టించడానికి ఈ రూమర్ క్రియేట్ చేశారు అని చెప్పుకొస్తున్నారు. బన్నీ విషయానికొస్తే.. స్టార్ సెలబ్రిటీల లిస్ట్ లో ఇన్స్టాగ్రామ్ లో బన్నీకి ఉన్నంతమంది ఫాలోవర్స్ ఇంకెవరికి లేరు. 28.5 మిలియన్ ఫాలోవర్స్ తో బన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు. చరణ్ కు 26 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇక ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న బన్నీ.. ఒక్కరిని మాత్రమే తిరిగి ఫాలో అవుతున్నాడు. ఆ ఒక్కరు ఎవరో కాదు ఆయన భార్య అల్లు స్నేహ రెడ్డి. వారి పెళ్లి అయిన దగ్గరనుంచి బన్నీ.. తన భార్య అకౌంట్ నే ఫాలో అవుతున్నాడు. ఇద్దరు కలిసి ఫ్యామిలీ ఫొటోస్ ను షేర్ చేసినప్పుడు ఒకరికొకరు ట్యాగ్ చేసుకుంటారు. ఎక్కువగా స్నేహ.. బన్నీ ఫొటోస్, అర్హ, అయాన్ ఫొటోస్ షేర్ చేసినా.. అర్జున్ ను ట్యాగ్ చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు చరణ్ అన్ ఫాలో గొడవ వచ్చింది కాబట్టి ఈ విషయం తెల్సింది. ఇప్పుడే కాదు.. మొదటి నుంచి చరణ్, బన్నీ ఒకరినొకరు ఫాలో చేసుకున్నది లేదు అని అంటున్నారు. మరి ఇంత రచ్చ జరిగాక బన్నీ కానీ, చరణ్ కానీ.. పోనీ మెగా ఫ్యామిలీలో ఎవరైనా దీని గురించి స్పందిస్తారేమో చూడాలి.