హైపర్ సోనిక్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇండియా..!

భారతదేశం ఆయుధ టెక్నాలజీలో మరో అడుగు ముందుకేసింది. అమెరికా, రష్యా, చైనా లాంటి అగ్రరాజ్యాలకు పోటీగా హైపర్ సోనిక్ మిస్సైల్స్ ను విజయవంతంగా పరీక్షించింది. ఓడిశా తీరానికి సమీపంలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం దీవిలో భారతదేశ ఆయుధ అభివృద్ధి శాఖ – డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) శనివారం నవంబర్ 16 2024న హైపర్ సోనిక్ మిస్సైల్స్ ని విజయవంతంగా పరీక్షించింది. ఈ టెక్నాలజీ ఇండియా సొంతంగా అభివృద్ధి చేయడం ఒక చరిత్రాత్మక ఘటన అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

 

లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ మిస్సైల్స్ కలిగి ఉండడంతో ఇప్పుడు ఇండియా.. అడ్వాన్స్ మిలిటరీ టెక్నాలజీ ఉన్న అగ్రరాజ్యాల సరసన చేరిందని రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ విజయం సాధించినందుకు డిఆర్‌డిఓకు శుభాకాంక్షలు తెలిపారు.

 

బాంబు పేలుడు సామాగ్రితో నిండుగా ఉండే ఈ హైపర్ సోనిక్ మిస్సైల్ 1500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పైగా ధ్వని వేగం కంటే 5 నుంచి 25 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకుపోతుంది. అందుకే దీన్ని హైపర్ సోనిక్ మిస్సైల్ అని అంటారు. ఒక సెకనుకు ఈ మిస్సైల్ 5 మైళ్లు (7.5 కిలోమీటర్లు) ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ మిస్సైల్ స్పీడ్, ఆకాశంలో ఎగిరే ఎత్తుని కంట్రోల్ చేయడానికి ఇందులో ఏవియోనిక్స్, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అమర్చడం జరిగిందని డిఆర్‌డిఓ వెల్లడించింది.

 

హైపర్ సోనిక్ మిస్సైల్ పరీక్షించడానికి ముందు నవంబర్ 12 న డిఆర్‌డిఓ ఈ మిస్సైల్ ని లాంచ్ చేసే అన్ని పరికరాలను పరీక్షించింది. అందుకే హైపర్ సోనిక్ మిస్సైల్ కంటే లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (ఎల్ఆర్ఎల్ఏసిఎం) ని ఒడిశా తీరంలోని చాందిపూర్ వద్ద ఒక మొబైల్ ఆర్టికులేటెడ్ లాంచర్ తో ప్రయోగించారు. ఈ పరిక్షలో రాడాడర్, ఎలెక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, టెలిమెట్రీ వంటి పరికరాల పనితీరు పరీక్షించారు.

 

అంతకుముందు డిఆర్‌డిఓ నవంబర 14న పినాకా రాకెట్ లాంచర్ ని విజయవంతంగా పరీక్షించింది. రష్యన్ గ్రాడ్ బిఎం-21 లాంచర్ స్థానంలో దీన్ని భారతదేశం సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేసింది. పినాకా రాకెట్ లాంచర్ పరీక్షలు విజయవంతం కాగానే అర్మేనియా, ఫ్రాన్స్ దేశాల నుంచి దీన్ని కొనుగోలు చేసుందుకు ఆర్డర్లు రావడం విశేషం. పినాకా రాకెట్ లాంచర్ కేవలం 44 సెకండ్లలో 12 రాకెట్లు ఫైర్ చేయగలదు.

 

దీని ద్వారా లాంచ్ చేసిన రాకెట్లు 60 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణిస్తాయి. ఇందులోని బ్యాటరీ 72 రాకెట్ల ప్రయోగం వరకు పనిచేస్తుంది. అయితే పినాకా రేంజ్ ఇంకా పెంచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. 120, 150, 200 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాగించగలిచే రాకెట్లను లాంచ్ చేయగలిగే కెపాసిటీకి పినాకా రేంజ్ పెంచుతామని చెబుతున్నారు. ముఖ్యంగా చైనా వద్ద ఉన్న లాంగ్ రేంజ్ గైడెడ్ సిస్టమ్స్ ను కౌంటర్ చేసేందుకు పినాక టెక్నాలజీని ఇండియా అభివృద్ధి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *