పాతాళానికి భారత ఆర్థిక వృద్ధి రేటు: ఐఎంఎఫ్‌

 కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో భారత వృద్ధి రేటు అంచనాలను పలు రేటింగ్‌ సంస్థలు, దేశీ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కుదిస్తున్న క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) షాకింగ్‌ అంచనాలతో ముందుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత్‌ వృద్ధి రేటు కేవలం 1.9 శాతానికి పరిమితమవుతుందని   ఐఎంఎఫ్‌ వెల్లడించింది. 1991 చెల్లింపుల సంక్షోభం తర్వాత భారత్‌ వృద్ధి రేటు ఇంతటి కనిష్టస్ధాయికి చేరుతుందనే అంచనా వెలువడటం ఇదే తొలిసారి. వృద్ధి రేటు దిగజారినా ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్ధల్లో భారత్‌ ఒకటని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

మరోవైపు అగ్రదేశాల్లో ఈ ఏడాది అమెరికా (-5.9), జపాన్‌ (-5.2), బ్రిటన్‌ (-6.5), జర్మనీ (-7.1), ఫ్రాన్స్‌ (-7.2), ఇటలీ (-9.1), స్పెయిన్‌ -8 శాతం నెగెటివ్‌ వృద్ధి రేటు నమోదు చేస్తాయని ఐఎంఎఫ్‌ నివేదిక పేర్కొంది. ఇక చైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందని తెలిపింది. భారత్‌, చైనాలు మాత్రమే సానుకూల వృద్ధి రేటును సాధిస్తాయని వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో పాశ్చాత్య దేశాల వృద్ధి రేటు మైనస్‌లోకి జారుకుంటుందని పలు సంస్ధలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *