“జై హనుమాన్” పై ప్రశాంత్ వర్మ హింట్..!

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు. ఆయన కోతితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) గురించి విషయాన్ని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఇక దీపావళి కానుకగా ట్రీట్ ఇవ్వబోతున్నాం అంటూ ఈ పోస్ట్ లో ఊరించారు ప్రశాంత్ వర్మ. మరి ఆ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం పదండి.

 

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్’ తో తన ప్రతిభను చాటి చెప్పాడు. ఈ సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టిలో పడ్డారు. ఈ సూపర్ హీరో చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద దాదాపు 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ‘హనుమాన్‌’ ఘనవిజయం తర్వాత అందరి దృష్టి ఆ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) పైనే ఉంది. ‘హనుమాన్’ మూవీ క్లైమాక్స్ లో సీక్వెల్ ఉంటుందనే విషయంతో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. అప్పటి నుంచి ‘జై హనుమాన్‌’ ఎప్పుడు తెరపైకి రాబోతోంది? నటీనటులు ఎవరు అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈ మూవీ గురించి సోషల్ మీడియా వేదికగా స్వయంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హింట్ ఇచ్చారు.

 

ఈ రోజు ఉదయం ప్రశాంత్ Xలో ఓ స్పెషల్ పోస్ట్ చేశారు. అందులో ఆయన ఒక కోతితో కలిసి కనిపించే రెండు ఫోటోలను పంచుకున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ పోస్ట్ లో “ మేము మళ్లీ కలిశాం! ఇది ఒక సంకేతం! #DIWALIisCOMING” అంటూ కోతి ఎమోజి ఉన్న ట్వీట్ చేశారు. ప్రశాంత్ ట్వీట్ సినీ ప్రేమికులను ఉత్కంఠకు గురి చేసిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీపావళి పండుగ రోజున ‘జై హనుమాన్’ (Jai Hanuman) గురించి ప్రశాంత్ అధికారికంగా ప్రకటించనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ దీపావళికి ప్రశాంత్ వర్మ ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.

 

కాగా మరోవైపు ‘జై హనుమాన్‌’ (Jai Hanuman)లో హనుమంతుడిగా నటించబోయే నటుడిపై గత కొన్ని నెలలుగా నాన్‌స్టాప్‌గా ఊహాగానాలు వస్తున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ల పేర్లు కూడా విన్పించాయి. అయితే అవన్నీ రూమర్లే అనే టాక్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ‘కాంతారా’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును గెలుచుకున్న శాండల్‌వుడ్ స్టార్ రిషబ్ శెట్టి ఈ చిత్రంలో లార్డ్ హనుమంతుడిగా నటించడానికి ఎంపికయ్యాడని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అఫిషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు.

 

ఇదిలా ఉండగా ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. మహాకాళి, అధీరా, జై హనుమాన్ సినిమాలను చేస్తున్నారు. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. మరోవైపు ‘హనుమాన్’ లో హీరోగా నటించిన తేజ సజ్జా ఇప్పుడు ‘మిరాయ్’ అనే సినిమా చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *