కశ్మీర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే కేంద్రం కీలక మార్పులకు శ్రీకారం..

జమ్ముకశ్మీర్లో సర్కారు ఏర్పాటుకు అక్కడి అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్ కూటమి సిద్ధమైపోయింది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్కు ఎన్సీ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఓ లేఖను సమర్పించారు.

 

ఇటీవలే ఎన్సీ అధినేత ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వ ఏర్పాటు అనుమతి ఇవ్వాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సెన్హాతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు తమ కూటమికి ఉందని తెలుపుతూ ఎల్జీకి ఆయన ఓ లెటర్ సమర్పించారు.

 

మరో రెండు మూడు రోజుల్లో ప్రమాణస్వీకారోత్సవం జరగనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మరోవైపు ఎన్సీ- కాంగ్రెస్ కూటమికి 54 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండగా, బీజేపీకి 29 మంది సభ్యుల బలం ఉండటం గమనార్హం.

 

ప్రెసిడెంట్ రూల్’కు ముగింపు…

 

ప్రభుత్వ ఏర్పాటు కంటే ముందే జమ్ముకశ్మీర్లో విధించిన రాష్టపతి పాలనను ఎత్తివేయాల్సిన అవసరం ఉన్నట్లు తెలుస్తోంది. నిపుణులు సైతం ఇదే మాటను అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రమాణస్వీకారానికి ముందే రాష్ట్రపతి పాలనకి ముగింపు కేంద్రం పలకనుంది.

 

ఆనాటి నుంచే రాష్ట్రపతి పాలన…

 

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని కేంద్రం జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన చేసింది. విభజన పరిణామాలు, భద్రతాపరమైన కారణాలతో 2019 జనరల్ ఎలక్షన్స్ తో పాటు అక్కడ పోలింగ్‌ ఏర్పాటు చేసేందుకు సీఈసీకి ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ అనుమతితో రాష్ట్రపతి 2019 అక్టోబర్ 31న రాష్ట్రపాతి పాలనను పొడిగించారు. ఈ మేరకు నోటిఫికేషన్ను సైతం జారీ చేయగా నేటికీ రాష్ట్రపతి పాలనే అక్కడ కొనసాగుతూ రావడం గమనవార్హం.

 

వైదొలిగిన బీజేపీ…

 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేయక ముందు బీజేపీ, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమి అధికారం చేపట్టింది. రాజకీయ కారణాల వల్ల 2018లో కూటమి నుంచి బీజేపీ వైదొలిగింది. ఈ కారణంగానే ఏకంగా ప్రభుత్వమే పడిపోయింది. ఫలితంగా ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ ఆరు నెలల పాటు గవర్నర్ పాలన సాగించారు. ఇప్పుడా ఆ కాలం ముగుస్తుండటం వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించింది. ఇక 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం రాజ్యాంగాన్ని సవరించింది.

 

త్వరలోనే నోటిఫికేషన్ జారీ…

 

జమ్ములో కొత్త ప్రభుత్వం కొలువుదీరాలంటే రాష్ట్రపతి పాలనను తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అనేక నిబంధనలు స్థంభించిపోయాయి. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే ముందే అసెంబ్లీకి సంబంధించిన ఆయా రూల్స్ పునరుద్ధించాల్సి ఉంటుంది. ఒమర్ అబ్దుల్లా సర్కార్ పూర్తి స్థాయిలో పనిచేయాలంటే రాష్ట్రపతి పాలనకు స్వస్తిపలకాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను త్వరలోనే రాష్ట్రపతి జారీ చేయనున్నారని సమాచారం.

 

ఆరేళ్లుగా రాష్ట్రపతి పాలనే…

 

రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రెసిడెంట్ రూల్’ను రద్దు చేస్తారు. ఆరేళ్లుగా అమల్లో ఉన్న పాలనను ఎత్తేయాలంటే సెంట్రల్ క్యాబినెట్ తప్పనిసరిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రాష్ట్రతి పాలనను తొలగించినట్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు.

 

కేంద్రం కీలక మార్పులు…

 

ఇక కశ్మీర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే కేంద్రం కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు కసరత్తులు సైతం చేస్తోంది. జమ్ముకశ్మీర్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దాదాపు ఆరేళ్లుగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనకు తెర పడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *