ఢిల్లీలో భారీగా డ్రగ్స్.. రూ.2 వేల కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం..

ఢిల్లీలో మరోసారి భారీ మొత్తంలో పట్టుబడిన మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 10 రోజుల వ్యవధిలో రెండోసారి కావడం గమనార్హం. దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసుల వెల్లడించారు. కాగా, గత వారమే ఢిల్లీలో రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

 

ఇదిలా ఉండగా, ఢిల్లీలో డ్రగ్స్ కార్యకలాపాలపై స్పెషల్ సెల్ ఉక్కుపాదం మోపుతోంది. వారం వ్యవధిలోనే రూ.7,500 కోట్ల విలువైన 762 కేజీల కొకైన్‌ను సీజ్ చేసింది. ఇటీవల 560 కేజీల డ్రగ్స్ ను సీజ్ చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. తాజాగా, 200 కేజీల కొకైన్ ను స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్ట్ చేసింది.

 

ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, పంజాబ్ లోని అమృతసర్ లోని విమానాశ్రయంలో జితేంద్ర పాల్ సింగ్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. జస్సీ అలియాస్ జితేంద్ర లండన్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరికి దేశంలో చాలా చోట్ల డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయని తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *