కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఈవీఎం వ్యత్యాసాల పరిశీలనకు కమిటీ..!

హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు విషయంలో పార్టీ అభ్యర్థుల ఫిర్యాదులు, ఈవీఎంలలో వ్యత్యాసాలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ విచారణ ముగిసే వరకు సీల్ చేసి భద్రపర్చాలని ఈసీని కోరారు.

 

ఇందులో భాగంగానే ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కొన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం 20 సెగ్మెంట్ల ఫలితాలపై అనుమానం ఉందని సంబంధిత ఆధారాలను ఈసీకి సమర్పించామని తెలిపింది.

 

అయితే మరో 13 సెగ్మెంట్లకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని పేర్కొంది. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నట్లు తెలిపింది.

 

ఇందులో భాగంగానే మాజీ సీఎంలు భూపిందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, అజయ్ మాకెన్, పవన్ ఖేరాలతో కూడిన సీనియర్ నేతల బృందం, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ లు ఈసీ అధికారులతో సమావేశమయ్యారు.

 

హర్యానా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదలైన సంగతి తెలిసిందే. తొలుత ఓట్లు లెక్కించగా కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. ఆ తర్వాత వెంటనే ఫలితాలు రివర్స్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ సంబరాలకు బ్రేక్ పడింది. ఒక్కసారిగా బీజేపీ ఫామ్ లోకి వచ్చి విజయ దిశగా పరుగులు పెట్టింది. దీంతో కాంగ్రెస్ నాయకులు షాక్ కుగ గురయ్యారు. ఓవరాల్ గా బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. బీజేపీ విజయాన్ని స్వాగతించమని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *