నందమూరి హీరో ఎన్టీఆర్ ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యాడు.. ఆ మూవీ తర్వాత ఆరేళ్లకు సోలో హీరోగా చేసిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘దేవర ‘.. కొరటాల శివ- తారక్ కాంబినేషన్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను అందుకున్న దేవర వరల్డ్ వైడ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.. ఏకంగా రూ. 406 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టి బాక్సాఫీస్ రికార్డ్ లను బ్రేక్ చేసింది. త్వరలోనే రూ. 500 కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్నఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు.. ఈ మూవీకి రూ. 300 కోట్ల బడ్జెట్ ను పెట్టిన విషయం తెలిసిందే.. ఆ బడ్జెట్ ను రిలీజ్ కు ముందే రాబట్టిన సంగతి ఇండస్ట్రీలో వినిపిస్తుంది. రిలీజ్ అయ్యాక అంచనాలకు తగ్గట్లే కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. పాన్ ఇండియా విడుదలైన దేవర ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేయగా మొత్తానికి రికార్దులు మోత మోగిస్తుంది.
అయితే ఈ సినిమాకు ఓటీటీ హక్కులను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. దాదాపు రూ. 155 కోట్లు చెల్లించిందని సమాచారం. తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల ఓటీటీ రైట్స్‌ను కలిపి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ మూవీ 50 రోజుల తర్వాత అంటే నవంబర్ 15 తారీఖున దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. ఈ మూవీ 400 కోట్ల కలెక్షన్ మార్క్ దాటి రూ.500 కోట్లకు చేరవయ్యాయి. రెండో వారంలోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఇలాంటి టైం లో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.