ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సెటైర్లు వేశారు. పాలిటిక్స్‌లో పవన్ ఫుట్‌బాల్ లాంటివారని, ఆయనను ఎవరైనా ఉపయోగించుకుంటారని తెలిపారు.
ఆయన చెబుతున్నట్లు సనాతన ధర్మం, హిందూ మతం ప్రమాదంలో లేవని అన్నారు. కేవలం బీజేపీ మాత్రమే ఇబ్బందుల్లో ఉందని పేర్కొన్నారు.
“నటుడిగా వివిధ చిత్రాల్లో వేర్వేరు పాత్రలు పోషిస్తారు. పాలిటిక్స్ అలా కాదని ఆయన తెలుసుకోవాలి. ఓ స్థిరమైన ఆలోచన ఉంటే బాగుంటుంది” అని ప్రకాశ్ రాజ్ హితవు పలికారు.
ఇక ఇప్పటికే ప్రకాశ్ రాజ్ పలుమార్లు జనసేనానిపై సెటైర్లు వేస్తూ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ఎంజీఆర్‌పై పవన్ ట్వీట్ చేయగా… దానికి స్పందించిన ప్రకాశ్ రాజ్.. ఉన్నట్టుండీ ఎంజీఆర్‌పై ఎందుకింత ప్రేమో అంటూ సెటైర్ వేసిన విషయం తెలిసిందే.