మాస్ మహారాజ్ తో తమిళ దర్శకుడు..?

సినిమా హిట్ టు ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలలో రవితేజ కూడా ఒకరు. ముందుగా అసిస్టెంట్ డైరెక్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నటుడుగా కొన్ని సినిమాల్లో కనిపించి, ఆ తర్వాత హీరోగా కూడా తనకంటూ మంచి గుర్తింపును సాధించుకున్నారు రవితేజ. రవితేజ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో రవితేజ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది అని చెప్పాలి.త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ధమాకా సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు రవితేజకు ఒక సక్సెస్ఫుల్ సినిమా కూడా పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మిస్టర్ బచ్చన్ నిరాశపరిచింది.

 

హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. హరీష్ ను దర్శకుడిగా రవితేజ షాక్ సినిమాతో పరిచయం చేశాడు ఆ సినిమా ఫలితం కూడా షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మిరపకాయ్ సినిమాతో అదిరిపోయే సక్సెస్ను రవితేజకు అందించాడు హరీష్. రవితేజ పైన హరీష్ కు విపరీతమైన ఇష్టం ఉంది. ఇది చాలా సందర్భాల్లో హరీష్ చెబుతూ వచ్చాడు.అటువంటి హరీష్ దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్నారు అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. అంతేకాకుండా మిస్టర్ బచ్చన్ సినిమాకి మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం మంచి ప్లస్ అయింది. సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేసింది మ్యూజిక్. కానీ ఫలితం మాత్రం నిరాశను మిగిల్చింది. ఇక ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రవితేజ తన 75వ సినిమాను చేస్తున్నాడు.

 

ఈ సినిమా తరువాత త‌మిళ ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సి.తో ఆయ‌న ఓ సినిమా చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఖుష్బూ ఈ చిత్రానికి నిర్మాత‌. సుంద‌ర్ సి.కి త‌మిళ‌నాట మంచి పేరుంది. థ్రిల్ల‌ర్ సినిమాలు, కామెడీ ట‌చ్ ఉన్న సినిమాల్ని బాగా హ్యాండిల్ చేస్తారాయ‌న‌. ఆయ‌న ద‌గ్గ‌ర ఓ ప‌వ‌ర్ ఫుల్ క‌థ ఉంది. అది ర‌వితేజ‌కు అయితే బాగుంటుంద‌ని, ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి కొన్నాళ్లుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చివ‌రికి ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డానికి రెడీ అయ్యింద‌ని తెలుస్తోంది. అన్నీ కుదిరితే ర‌వితేజ 76వ సినిమా ఇదే అవుతుంది. ఇటీవ‌ల ర‌వితేజ చేతికి గాయం అవ్వ‌డంతో ఆయ‌న షూటింగుల‌కు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కోలుకొన్న త‌ర‌వాత‌… సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ సినిమాని ముందుగా పూర్తి చేస్తారు. ఆ త‌ర‌వాత సుంద‌ర్ సి. సినిమా ముందుకు వెళ్తుంది. మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లో తెలియనున్నాయి.

 

రవితేజ సినిమా ప్లాప్ అయినా హిట్ అయినా కూడా పెద్దగా మార్కెట్ పై ప్రభావం చూపించదు. ఎందుకంటే రవితేజ సినిమాలు అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటాయి అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. అసలు రవితేజ టైమింగ్ ను కరెక్ట్ గా వాడుకుంటే అద్భుతమైన సినిమాలు వస్తాయి అని చాలామంది దర్శకులకు తెలుసు. కానీ కొంతమంది దర్శకులు ఎందుకు ఆ ప్రయత్నాలు చేయట్లేదు. హరీష్ లాంటి దర్శకులకు అవకాశం వచ్చినా కూడా ఇలా చేశారు అని కొంతమంది అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *