మంత్రి కొండా సురేఖ vs ఫిల్మ్ ఇండస్ట్రీ..! ముదురుతున్న వివాదం.

మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.. ఇప్పుడు టాలీవుడ్ లో తుఫాన్ కు కారణమైంది. ఆమె తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకునే క్రమంలో కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ మరో కుటుంబం పేరు చెప్పడంతో హాట్ డిబేట్‌కు దారి తీసింది. చాలా మంది సినీ ఇండస్ట్రీ ప్రముఖులు వరుసగా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. అగ్రెసివ్ అవుతున్నారు. దీనిపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్నారు కూడా. కానీ మంత్రి టార్గెట్ కేటీఆరే. ఎలాంటి న్యాయపోరాటానికైనా రెడీ అంటున్నారు. తనకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారు.

 

చూశారుగా.. మంత్రి కొండా సురేఖ ఆవేదన. ఎంపీ రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమంలో జరిగిన ఘటనను బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ట్రోల్ చేయడం మొదలు పెట్టింది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నూలు దండ వేస్తే దాన్ని పట్టుకుని నానా రచ్చ చేశారు. మంత్రి చాలా ఎమోషనల్ అయ్యారు. గాంధీభవన్ లో కంట తడి పెట్టుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందే అన్నారు.

 

నెక్ట్స్ డే హరీష్‌రావు ఓ ట్వీట్ చేశారు. కొండ సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీశ్. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని సహించమని హరీశ్ రావు ట్వీట్లో పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అన్నారు హరీశ్ రావు. కానీ మంత్రి కొండా సురేఖ కొంత వరకు కూల్ అయ్యారు. కానీ కేటీఆర్ మాత్రం క్షమాపణ చెప్పకపోవడంతో మరింత ఆగ్రహానికి గురయ్యారు. అసలు కేటీఆర్ ఏంటో చెప్పబోయే క్రమంలో చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశారు. చెప్పాలంటే బరస్ట్ అయ్యారు.

 

మంత్రి సురేఖ కామెంట్స్‌పై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. సినిమా ఇండస్ట్రీ బరస్ట్ అయింది. మంత్రిగా ఉండి ఇదేనా కామెంట్స్ అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అటు సమంత, ఇటు అక్కినేని కుటుంబం ఇష్యూపై రియాక్ట్ అయింది. విడాకులు ఇద్దరి సమ్మతంతోనే తీసుకున్నామని, తమ విషయాలను రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. నిజానికి కొండా సురేఖ టార్గెట్ కేటీఆర్. ఆయన్ను కౌంటర్ చేయబోయి సమంత-నాగచైతన్య ఇష్యూపై మాట్లాడారు. సమంత సహా ఇతర హీరోయిన్లను కూడా కేటీఆర్ ఇబ్బంది పెట్టారన్న పాయింట్ హైలెట్ చేయాలనుకున్నారు. కానీ ఈ మ్యాటర్ లో అక్కినేని కుటుంబం, అటు సమంత ఇబ్బంది పడే పరిస్థితి రావడంతో బేషరతుగా క్షమాపణ చెప్పారు. అలాగే కేటీఆర్ క్షమాపణ చెప్పేదాకా విడిచిపెట్టేది లేదని కూడా కౌంటర్ ఇచ్చారు.

 

కాబట్టి ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇబ్బంది పడ్డ వారికి మంత్రి క్షమాపణలు చెప్పేశారు. అక్కడితో మ్యాటర్ ముగిసిపోయింది. అయితే కేటీఆర్ మాత్రం సురేఖ క్షమాపణలు చెప్పాల్సిందే అని, చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. తాను కూడా న్యాయపోరాటానికి సిద్ధమని మంత్రి కూడా ప్రకటించారు. తనను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ కించ పరిస్తూ చూస్తూ ఊరుకుంటావా అన్నది మంత్రి ప్రశ్న. అయితే ఈ ఇష్యూ సినిమా ఇండస్ట్రీలో ఇబ్బందికరంగా మారడంతో నష్ట నివారణ చర్యలు జరిగాయి. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఎంట్రీ ఇచ్చి.. ఈ ఇష్యుకు పుల్ స్టాప్ పెట్టాలన్నారు. మంత్రి క్షమాపణలు చెప్పారని ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలన్నారు.

 

కాబట్టి ఇప్పుడు సమంతను, నాగచైతన్య, నాగార్జునపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సినిమా ఇండస్ట్రీ మొత్తం ఖండిస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న వారిని ఇలా లాగడం కరెక్టేనా అని అంతా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ మ్యాటర్ మరో మలుపు తిరుగుతోంది. గతంలో నారా భువనేశ్వరిని, పవన్ కల్యాణ్ సతీమణిని తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఎక్కడపోయిందన్న కౌంటర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *