ఏపీలో మళ్లీ పర్నీచర్ లొల్లి..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల ఫర్నీచర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికార టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు మంత్రి నారా లోకేష్. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్లొద్దాం.

 

జగన్ క్యాంపు కార్యాలయం వినియోగిస్తున్న పర్నీచర్‌పై వైసీసీ అధికారులకు లేఖ రాసింది. దీనిపై మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ తన ముఠాతో ఉత్తరాలు రాయిస్తున్నారని రుసరుసలాడారు.

 

‘‘జగన్ దాదా 40 మంది దొంగలు రాష్ట్రంపై పడి బందిపోట్లులా దోచేశారు.. చివరికి ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్‌ని జనం దించేసినా.. సిగ్గు లేకుండా కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు ఎత్తుకుపోయాడు. అడ్డంగా దొరికిపోయిన దొంగ జగన్.. తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నాడు. ఆనాడు మా పెద్దాయన కోడెల శివప్రసాద రావు గారు ఇదే లేఖ రాస్తే, ఎంత అమానవీయంగా ప్రవర్తించావో గుర్తు తెచ్చుకో జగన్’’.. అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు మంత్రి నారా లోకేష్.

 

ఇంతకీ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి సాధారణ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీకి లేఖ రాశారు. అందులోని సారాంశం ఏంటంటే.. జగన్ క్యాంపు క్యారాలయంలో వినియోగిస్తున్న పర్నీచర్‌లో తమ దగ్గర కొంత ఉంచుకునేందుకు అనుమతించాలని అందులో పేర్కొన్నారు. మిగతా వాటికి రేటు ఎంతన్నది చెబితే చెల్లించేందుకు రెడీ అంటూ రాసుకొచ్చింది.

 

మిగిలిన వాటిని తిరిగి ఇచ్చేస్తామ్నది అందులోని మెయిన్ పాయింట్. దీనిపై మీడియా ముందుకొచ్చిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు లేఖ రాశామని చెప్పుకొచ్చారు.

 

ఏపీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా తన దగ్గరున్న ప్రభుత్వ ఫర్నీచర్ పంపిస్తానని అప్పటి జగన్ సర్కార్ లేఖ రాశారు. ఫర్నీచర్ కు ఎంత చెబితే అంత మొత్తం చెల్లిస్తానని పేర్కొన్నారు. ఇవేమీ పట్టించుకోలేదు. అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ చెప్పిన విషయం తెల్సిందే.

 

తిరుమల డిక్లరేషన్ విషయంలో జగన్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అది ఆ పార్టీకి మైనస్ అయ్యింది. రీసెంట్‌గా డిప్యూటీ సీఎం పవన్ తన కూతుళ్లతో తిరుమలకు వెళ్లారు. కూతురు తరపున డిక్లరేషన్ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఫర్నీచర్ వ్యవహారాన్నివెలుగులోకి తెచ్చిందని అంటున్నారు. లేకపోతే జూలై లేఖ రాస్తే ఇప్పుడు బయటపెట్టడం ఏంటని కొందరి నేతల ప్రశ్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *