కొండా సురేఖ Vs కేటీఆర్ కామెంట్స్..! ముదురుతున్న వివాదం..!

మంత్రి కొండా సురేఖ- కేటీఆర్ వ్యవహారంపై నెక్ట్స్ ఏం జరుగుతోంది? రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారు? ఇరు పార్టీల నేతల సైలెంట్ వెనుక అసలేం జరిగింది? బీఆర్ఎస్-తెలంగాణ కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతోందనే దానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాలు చర్చలు జరుగుతున్నాయి.

 

రాజకీయాలంటే ఒకప్పుడు హుందాగా ఉండేవి. కేవలం ప్రభుత్వాలు తీసుకొచ్చిన పాలసీలపై అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగేది. ఈ క్రమంలో నేతలు భావోద్వేగానికి గురైన సందర్భాలు అప్పుడప్పుడు కనిపించాయి. ప్రజలు కూడా వీటిని ఆసక్తిగా గమనించేవారు. ఇదంతా ఒకప్పటి మాటలు.

 

పరిస్థితి మారాయి.. నేతల ఆలోచన తీరు మారింది. పార్టీలను పక్కనబెట్టి నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న సందర్భాలు కోకొల్లలు. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై మరొకరు వ్యక్తిగత ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో న్యాయస్థానం సైతం రాజకీయ పార్టీలకు సూచన చేసింది.

 

ప్రస్తుతం రాజకీయాలంటే రాళ్లు, రప్పలు వేయడమే. హుందాతనానికి తిలోదకాలు ఇచ్చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. వ్యక్తిగతంలో ఎంత డ్యామేజ్ చేస్తే అంత బలపడ వచ్చన్నది నేతల ఆలోచన. ఆ ప్లాన్ నేతల మధ్య మాటల మంటలు. కొండా సురేఖ Vs కేటీఆర్ కామెంట్ల ఎపిసోడ్‌లో ఆయా పార్టీల నాయకత్వాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయనే ఆసక్తికరంగా మారింది.

 

ఈ ఎపిసోడ్‌కు సోషల్‌మీడియా పోస్టులే కారణమని భావిస్తున్నాయి. వ్యక్తిగతంగా మంత్రి కొండా సురేఖపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడంతో ఆమె కంట్రోల్ చేసుకోలేకపోయారని మద్దతుదారుల మాట.ఈ వ్యవహారం గడిచిన నాలుగు రోజులుగా జరుగుతున్నా ఆమె నోరు ఎత్తలేదంటున్నారు. పరిస్థితి శృతి మించడంతో ఆ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని అంటున్నారు.

 

కాకపోతే మరో ఇండస్ట్రీని ఇందులోకి లాగడం సరికాదని కొందరు నేతలంటున్నారు. అక్కినేని కుటుంబం, సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో స్పందించారు మంత్రి కొండా సురేఖ. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని అన్నారు. కానీ.. సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా అని గుర్తు చేశారు. తన వ్యాఖ్యల పట్ల సమంత, ఆమె అభిమానులు మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించు కుంటున్నానని పేర్కొన్నారు మంత్రి.

 

రాజకీయాల్లో నేతల మధ్య వ్యక్తిగత ఆరోపణలు సహజమేనని లైట్‌గా తీసుకుంటాయా? నేతలను పిలిచి పార్టీలు మందలిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇటు బీఆర్ఎస్, అటు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు సైలెంట్‌గా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *