పురందేశ్వరిపై రోజా గరంగరం..!

తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఆర్.కె రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను పురంధేశ్వరి పక్కదోవ పట్టిస్తున్నారన్నారు.

 

తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కామెంట్‌పై పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలపై రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది. బావ కళ్లల్లో ఆనందం చూడడం కంటే భక్తుల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించాలని కోరారు.

 

కూటమి ప్రభుత్వానికి చెందిన న్యాయవాది సుప్రీంకోర్టులో ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోవడంతోనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. తిరుమల లడ్డూ వంటి సెన్సిటీవ్ విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని కామెంట్ చేసిందన్నారు.

 

ఈ విషయంపై సీఎం హోదాలో ఏమైనా మాట్లాడవచ్చని, ప్రజల చేత ఎన్నుకోబడిన వారు మాట్లాడకూడదా? అని పురంధేశ్వరి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మీతోపాటు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు రోడ్లపై ప్రెస్ మీట్‌లు నిర్వహించి ఏం మాట్లాడుతున్నారో.. ఇవే మాటలు కోర్టులో ఎందుకు మాట్లాడలేకపోయారో చెప్పాలన్నారు.

 

ప్రజలు గమనిస్తున్నారని, ఎటువంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో పరీక్షలు చేయలేదని లాయర్ చెప్పారన్నారు. అలాగే ఇన్వెస్టిగేషన్ జరగకుండా పవిత్రమైన లడ్డూపై నిందలు వేసి మతకల్లోలాలు సృష్టిస్తుండగా.. సుప్రీంకోర్టు అడగడంలో ఏం తప్పు ఉందన్నారు.

 

ఏపీకి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు లేదా టీడీపీకి రాష్ట్ర అధ్యక్షురాలు అనే విషయంపై అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సర్ధిచెప్పాలన్నారు. తప్పు చేసిన వ్యక్తులను శిక్షించేలా ప్రభుత్వానికి చెప్పాలన్నారు.

 

పవన్ కల్యాణ్ ఇది సినిమా షూటింగ్ కాదని, రోజుకో వేషం వేసుకొని మాట్లాడి అందరి మనోభావాలను దెబ్బతీయడానికి అధికారం ఇవ్వలేదన్నారు. పవన్ తప్పు చేశాడు కాబట్టే దేవుడు ప్రాయశ్చిత దీక్ష చేయించాడని రోజా అన్నారు.

 

మీ కుటుంబ సభ్యులతోపాటు మీరు భగవంతుడే లేరని చెప్పారని, జగన్‌ను టార్గెట్ చేయాలని చూస్తే బాగోదన్నారు. బీజేపీ ఏపీలో ఎంట్రీ ఇస్తే తమ పరిస్థితి ఏంటని, టీడీపీ చేస్తున్న కుట్రలో పాలుపంచుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కానీ పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేసేలా మాట్లాడుతున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

 

తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టు సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని, ఇందులో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే టీటీడీ ఈఓకు సంబంధం ఉంటుందన్నారు. ఈఓకు నోటీసులు ఇచ్చి విచారణ చేయించాలన్నారు. ఆ కమిటీ ఉన్న వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేయించాల్సిన అవసరం ఉందన్నారు.

 

విజిలెన్స్ లో తప్పు జరుగుతుంటే ఏం చేశారని, ఆ ఆఫీసర్స్ కు కూడా నోటీసు ఇచ్చి విచారించాలన్నారు. అధికారంలో ఉండి ఆధారాలు సేకరించాలన్నారు. కేవలం జగన్ తోపాటు వైసీసీ లేకుండా చేయాలని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. శ్రీవారి లడ్డూ విషయంపై జోలికి పోవద్దని, సుప్రీంకోర్టు విచారణకు సిద్ధమని, సీబీఐ వేసినప్పటికీ సిద్ధమని రోజా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *