ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మంగళవారం పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఉదయం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఆయన పరామర్శించనున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖత్వా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ అస్వస్థకు గురైన మల్లికార్జున ఖర్గే.
బీపీ పెరగడం వల్ల అస్వస్థతకు గురైనట్లు తెలిపారు డాక్టర్లు. ఈ విషయంలో తెలియగానే వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు ఢిల్లీ వెళ్లి ఖర్గేను పరామర్శించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం.
ఖర్గేను కలిసి పరామర్శించడంతోపాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. పార్టీ అగ్రనేతలను ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది. పనిలోపనిగా అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లతో సీఎం రేవంత్ సమావేశమయ్యే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
హైడ్రా, మూసీ ప్రక్షాళన తదితర అంశాలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో అందుకు గల కారణాలను అధిష్టానానికి వివరించే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.