తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ 2024 ఫలితాలను సోమవారం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన ర్యాంకులు సాధించిన అభ్యర్థులు సర్టిఫికెట్స్ పరీశీలన నేటినుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు నేటి నుంచి అక్టోబర్ 5 వరకు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెషన్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.
కాగా, ఇప్పటికే సర్టిఫికెట్ పరిశీలనకు అధికారులు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపికైన అభ్యర్థుల ఫోన్‌కు ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు. దీంతోపాటు ఆయా జిల్లా డీఈఓల వెబ్ సైట్ లో 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల పేర్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
సర్టిఫికెట్ వెరిఫికెషన్ ప్రక్రియ.. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు ఆయా జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో వెరిఫికేషన్ ఉంటుందన్నారు. పూర్తి సమాచారం కోసం విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా సూచించారు.