దేవర హీట్ తగ్గింది.. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ రచ్చ మొదలయ్యింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక వీటి తరువాత గేమ్ ఛేంజర్ నుంచి మరో అప్డేట్ వచ్చిందే లేదు.
ఫ్యాన్స్ .. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసి.. సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయించారు. అదే రా మచ్చ మచ్చ రా. నేడు ఈ లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. “కల్లజోడు తీస్తే నీలాంటి వాడ్నే.. చొక్కా పైకి పెడితే నీలాంటి వాడ్నే..” అంటూ మొదలైన సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మొదటి షాట్ నే హెలికాఫ్టర్ నుంచి చరణ్ దిగుతున్న ఎంట్రీని చూపించి హైప్ పెంచారు. చరణ్ ఎంట్రీ సాంగ్ అని శంకర్ ముందే చెప్పడంతో.. అతని వ్యక్తిత్వాన్ని చూపించే తరహాలో ఈ సాంగ్ ను తీర్చిదిద్దినట్లు కనిపిస్తుంది.
నిజం చెప్పాలంటే చరణ్ లాంటి మాస్ హీరోకు ఇలాంటి ఎంట్రీ ఊహించవచ్చు కానీ.. ఇంకొంచెం మాస్ ఉంటే బావుంటుంది అని చెప్పాలి. మ్యూజిక్ మొత్తం తేలిపోయినట్లు ప్లాట్ గా ఉంది. థమన్.. ఈ విషయంలో కచ్చితంగా ట్రోల్స్ ఎదుర్కొంటాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇక ఈ సాంగ్ కోసం శంకర్ కష్టం కనిపిస్తుంది. మేకింగ్ వీడియోలో అంతమంది డ్యాన్సర్స్ ను మేనేజ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ జానపద కళాకారులను ఒక్కొక్కరిగా పిలిచి.. ఆ మ్యూజిక్ తగ్గ డ్యాన్స్ ను కంపోజ్ చేయించిన తీరు అద్భుతం.
ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. చరణ్ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్. బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్టెప్స్.. చరణ్ గ్రేస్ అదిరిపోయింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. చివర్లో చరణ్.. చిరు కటౌట్ వద్ద వీణ స్టెప్ వేయడం సాంగ్ మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. చిరు సాంగ్స్ కు చరణ్ స్టెప్స్ వేయడం కొత్తేమి కాదు.. చాలా సందర్భాల్లో తండ్రి స్టెప్స్ అదరగొట్టాడు. ఇందులో కూడా వాల్తేరు వీరయ్య కటౌట్ ముందు చరణ్ ఇంద్రలోని వీణ స్టెప్స్ వేస్తూ కనిపించాడు. ఈ ఒక్క బీట్ మాత్రం సాంగ్ మొత్తం హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సాంగ్ కు థియేటర్ లో పూనకాలే అని చెప్పొచ్చు.
చరణ్ తో పాటు ఫ్యాన్స్ కూడా థియేటర్ లో వీణ స్టెప్ వేస్తూ వీడియోలు పెట్టడం ఖాయమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. నిజం చెప్పాలంటే.. చరణ్ కటౌట్ కు, డ్యాన్స్ కు ఈ ఎంట్రీ సరిపోదు. ఈ మ్యూజిక్ అంత వైబ్ ఇవ్వలేదు. జరగండి సాంగ్ కుడా స్లో పాయిజన్ లా ఫ్యాన్స్ మైండ్ లోకి ఎక్కింది. మరి ఈ రా మచ్చ మచ్చ కూడా అలానే స్లోగా ఎక్కుతూ చార్ట్ బస్టర్ లిస్ట్ లో చేరుత్తుండేమో చూడాలి.