చెన్నై పోర్టులో 112 కేజీల డ్రగ్స్ సీజ్..

దేశంలో డ్రగ్స్ వినియోగం చాప కింద నీరుగా సాగుతోంది. ఎక్కడో దగ్గర భారీ ఎత్తున పట్టుబడుతున్నాయి. వీటిని కంట్రోల్ చేసేందుకు కేంద్రం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా ఎక్కడో దగ్గర భారీగా పట్టుబడుతున్నాయి.

 

తాజాగా చెన్నై పోర్ట్‌లో భారీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. కంటైనర్‌లో ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. పట్టుబడిన కంటెయినర్ చెన్నై పోర్ట్ నుంచి ఆస్ట్రేలియాకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

 

డ్రగ్స్ మాఫియా గుజరాత్ నుంచి చెన్నైకి షిప్ట్ అయ్యిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దేశంలో అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు ముఠాలు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో గుజరాత్ తీరంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుమారు 86 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది.

 

తాజాగా చెన్నై పోర్టులో 112 కేజీల డ్రగ్స్ పట్టుబడినట్టు వార్తలు వస్తున్నాయి. పట్టుబడిన డ్రగ్స్‌తోపాటు రెండు లగ్జరీ కార్లు ఉన్నట్లు అంతర్గత సమాచారం. దాదాపు నాలుగు లక్షల క్యాష్ సైతం పట్టు బడింది.

 

చెన్నై పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు వాటిని తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. అరెస్టయిన వారి నుంచి వివరాలు సేకరించే పనిలో కస్టమ్స్ అధికారులు నిమగ్నమయ్యారు. కంటెయినర్‌లో 450 బ్యాగ్‌లను గుర్తించింది. వాటిని పరిశీలించగా 37 క్వార్ట్జ్ పౌడర్ బ్యాగుల్లో దాదాపు 3 కిలోల సూడోపెడ్రిన్‌తో కూడిన 37 ప్యాకెట్లను ఉన్నట్లు తేలింది.

 

ఎక్కడ నుంచి చెన్నై పోర్టుకి తీసుకొచ్చారు? ఆస్ట్రేలియాలో ఏ ప్రాంతానికి తీసుకెళ్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? అనేదానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. తీగ లాగితే డొంక కదలడం ఖాయమని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *