ఏపీలో టిడిపి కూటమి ఏర్పడిన అనంతరం పాలనపై పూర్తి పట్టు సాధించేందుకు ముండగు వేసింది. అలాగే సూపర్ సిక్స్ హామీలతో అధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం వాటి అమలు తీరుపై కసరత్తు ప్రారంభించింది. ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు ఇప్పటికే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసిన ప్రభుత్వం, డీఎస్సీ నోటిఫికేషన్ పై తొలి సంతకం సైతం చేశారు. ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్దిపై దృష్టి సారించిన ప్రభుత్వం.. అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై కసరత్తు ప్రారంభించిందనే చెప్పవచ్చు. అయితే రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించే విజన్ ఉన్న నాయకుడిగా గుర్తింపు గల సీఎం చంద్రబాబు.. రాష్ట్ర అభివృద్దిలో ఈసారి ప్రజలను భాగస్వామ్యం చేసే చర్యకు శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వం ఏర్పడ్డ సమయం నుండి అభివృద్ది వైపు ముందడుగు వేస్తున్న కూటమికి విజయవాడ వరదలు ఒక శాపంగా మారాయని చెప్పవచ్చు. అయితే ఈ వరదలను ప్రభుత్వం గట్టిగా ఎదుర్కొంది. నీట మునిగిన ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టడం నుండి, బుంగమేరు కాలువ గండిని పూడ్చడం వరకు చంద్రబాబు చూపిన చొరవపై ప్రజల అభినందనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలోనే వరదలు రాగా.. విజయవాడలో మళ్లీ ఇటువంటి స్థితి తలెత్తకుండా సీఎం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు భారీ పరిశ్రమలు రాష్ట్రం వైపు అడుగులు వేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందనే చెప్పవచ్చు. ఇలా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాల వైపు ముందడుగు వేసి, ప్రజలకు తమదైన పరిపాలన మార్క్ చూపించనుంది. ఈ దశలో సీఎం చంద్రబాబు ఒక బృహత్తర ప్రణాళిక కూడా రూపొందించారు. తన పాలనలో ఎప్పుడూ మార్క్ చూపించే చంద్రబాబు.. 2024లోనే 2047 నాటికి రాష్ట్ర వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా ఎంచుకున్నారు. ఏపీ 2047 నాటికి పూర్తి అభివృద్ది రాష్ట్రంగా గురించబడాలన్నదే సీఎం చంద్రబాబు తపన. కాగా.. తన లక్ష్యసాధనకు ప్రజలు కూడా కలిసి రావాలన్నదే తన అభిప్రాయంగా బాబు పాలనలో నూతన మార్క్ కి శ్రీకారం చుట్టారు. అదే రాష్ట్ర అభివృద్ది కోసం, 2047 వృద్ధిరేటు సాధన కోసం ప్రజల నుండి సూచనలు, సలహాలు ఆహ్వానిస్తున్నారు. ఇలా సూచనలు అందజేసిన ప్రజలకు ప్రభుత్వం నుండి ఒక చిన్న కానుక సైతం ప్రకటించారు సీఎం చంద్రబాబు.
సీఎంకు సూచనలు ఇచ్చేందుకు ఆసక్తి కలిగిన వారు swarnandhra.ap.gov.in/Suggestions వెబ్ సైట్ సంప్రదించాలని ప్రకటన జారీ చేశారు. అంతేకాదు ఇలా సలహాలు అందించిన వారికి ఈ-సర్టిఫికెట్ అందిస్తామని తెలిపారు. నేరుగా సీఎంకు రాష్ట్ర అభివృద్ది కొరకు సలహాలు ఇచ్చే అవకాశం రావడం, అందుకు తగిన గుర్తింపు లభించడంపై రాజకీయ విశ్లేషకుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. జస్ట్ ఇలా వెబ్ సైట్ లోకి వెళ్ళండి.. ఒక్క సలహా ఇవ్వండి.. ప్రభుత్వం అందించే సర్టిఫికెట్ పొందండి.