దేవర రివ్యూ వచ్చేసింది..!

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘దేవర’. దాదాపు మూడేళ్ల విరామం తరువాత ఎన్టీఆర్‌ నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. అంచనాలకు తగిన విధంగానే చిత్రం ప్రారంభ వసూళ్లు కూడా వున్నాయి. ఓవర్సీస్‌తో పాటు ఏపీ, తెలంగాణలో కూడా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఊహించని విధంగా వున్నాయి. ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ముందస్తు ప్రత్యేక ప్రదర్శనకు అనుమతులు జారీ చేశాయి. ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర ఎలా వుందో ట్విట్టర్‌ రివ్యూలో తెలుసుకుందాం..

 

దర్శకుడు కొరటాల శివ ఎంచుకున్న సినిమా నేపథ్యం ఆడియన్స్‌ కు చాలా కొత్తగా, ఫ్రెష్‌ ఫీల్‌ను కలుగజేస్తుంది. కథ, కథనం చాలా గ్రిప్పింగ్‌గా వుంది. ఫస్ట్‌హాఫ్‌ వేగంగా నడిచే కథనంతో, ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించే విధంగా వుంది. సెకండాఫ్‌ కాస్త నెమ్మదించినా ఆయుధ ఏపిసోడ్‌, పతాక సన్నివేశాలు ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి, ముఖ్యంగా దేవ, వర ద్విపాత్రాభినయంలో ఎన్టీఆర్‌ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.

 

కొరటాల తన రచన పదును మరోసారి దేవర చిత్రంతో చూపించాడు. జాన్వీ గ్లామర్‌ సినిమాకు అదనపు ఆకర్షణ. పాటలన్నీ కథలో భాగంగా వున్నాయి. పిక్చరైజేషన్‌ బాగుంది. అనిరుధ్‌ బీజీఎమ్‌ స్టోరీని ముందుకు నడిపించడంతో పాటు స్టోరీ మూడ్‌ తగిన విధంగా వుంది. విజువల్స్‌, పిక్చరైజేషన్స్‌ టాప్‌ లెవల్‌లో వున్నాయి. ఎన్టీఆర్‌ అభిమానులకు, మాస్‌ ఆడియన్స్‌కు ఈ సినిమా మాస్‌ ఫీస్ట్‌లా అనిపిస్తే సగటు ప్రేక్షకుడికి మాత్రం వన్‌టైమ్‌ వాచ్‌ మూవీలా అనిపిస్తుంది. ఫైనల్‌గా ‘దేవర’ను అందరూ థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన సినిమాలా అనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *