ఆహారం దొరకకపోవడం.. రహదారులు, వీధులన్నీ నిర్మానుష్యంగా మారడంతో వీధి కుక్కలు గంగవెర్రులెత్తుతున్నాయి. విపరీత ప్రవర్తనతో మనుషులపై ఎగబడుతున్నాయి. వాహనాల వెంట పరుగెత్తి బెంబేలెత్తిస్తున్నాయి. హోటళ్లు, బార్‌లు, ఫంక్షన్ హాళ్లు , హాస్టళ్లు వంటి వాటితో వీటికి నిత్యం ఆహారం దొరికేది. లాక్‌డౌన్‌తో ఇవి మూతపడటంతో ఆకలితో నకనకలాడుతున్నాయి. తాగునీరు కూడా దొరక్కడీహైడ్రేషన్‌కు గురవుతున్నాయి. అడపాదడపా మనుషులు కనిపిస్తేపిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో అత్యవసర పనుల మీదబయటకు వెళ్లేవారు, రాత్రుళ్లు విధులు నిర్వహించే వారు కుక్కల భయంతో వణికిపోతున్నారు. పగలు బిక్కుబిక్కుమంటున్న కుక్కలు రాత్రిళ్లు ఆకలికి తాళలేక తీవ్రంగా అరుస్తున్నాయని వివిధ ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు.
కుక్కల జీవిత కాలం సుమారు 10 ఏళ్లు. 8 నెలలు వచ్చినప్పటి నుంచే కుక్కలకు సంతానోత్పత్తి సామర్థ్యం ఉంటుంది. గర్భస్థ సమయం దాదాపు రెండు నెలలు. ఒక్కో కుక్క ఏటా రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేస్తుంది. తడవకు 4– 8 పిల్లలు పుడతాయి. ఇలా ఒక కుక్క ద్వారా ఏటా 40కిపైగా కుక్కలు జనం మధ్యకు వస్తున్నాయి.
10 లక్షల కుక్కలున్నాయి. అంటే ఏటా ఎన్ని కుక్కలు పుడతాయో అంచనా వేసుకోవచ్చు. వీటి సంతతిని అరికట్టే యంత్రాంగం, వనరులు, సామర్థ్యం జీహెచ్‌ఎంసీ వద్ద లేవు. దీంతో కుక్కల సంతాన నిరోధక ఆపరేషన్లు, వ్యాధి సోకకుండా యాంటీరేబిస్ వ్యాక్సిన్లు వంటివి వేస్తున్నా అవి సరిపోవడం లేదు. ఏటా దాదాపు 60వేల కుక్కలకు ఆపరేషన్లు చేస్తున్నా, వ్యాక్సిన్లు వేస్తున్నా నగరంలో కుక్కల సమస్య తగ్గడం లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.