మహేష్, రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ..?

త్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడా అనే ఆలోచన జనాల్లో ఆసక్తి పెరిగింది. జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే.. రెండేళ్లు పూర్తి అవుతున్నా కూడా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. కానీ ఒక్కో న్యూస్ మాత్రం బయటకు వస్తుంది. కథను రెడీ చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేశారు. కానీ సినిమాకు కొబ్బరికాయను మాత్రం జక్కన్న కొట్టలేదు.. ఇప్పటికే ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటుగా అటు సినీ అభిమానులు కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది.

 

రాజమౌళి సినిమాలు అంటే కాస్త ఆలస్యం అవ్వడం పక్కా.. తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నాయి కాబట్టి, ఈ ఎంపిక మరింత కష్టతరమైంది. ముఖ్యంగా, మహేశ్ బాబు మరియు రాజమౌళి లాంటి పెద్ద స్టార్స్ కలిసి చేస్తున్న సినిమాల్లో హీరోయిన్ ఎవరు అనేది ప్రేక్షకులను ఎంతగా ఆసక్తి కలిగిస్తుందో ఊహించలేము.. జక్కన్న, మహేష్ కాంబోలో మొదలు కాబోతున్న సినిమాలో హీరోయిన్ ఎవరో అనేది ప్రస్తుతం తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్. సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం దర్శకుడు రాజమౌళి ఫారిన్ హీరోయిన్ ను ఫిక్స్ చేసాడనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి..

 

ఇకపోతే ఇండోనేషియా పాప చెల్సియా ఎలిజబెత్ పేరు ఈ లిస్టులో ముందు ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా, మరో ఇద్దరు తెల్ల హీరోయిన్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న నేపథ్యంలో ఇంగ్లిష్ హీరోయిన్ల ను ఎంచుకోవడం ద్వారా సినిమాకు మరింత మార్కెట్‌ను అందుకోవచ్చనే ఆలోచన దర్శకుడిది. అయితే, ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అలియాభట్ ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ సినిమాకు ఆమె కూడా ఒప్పుకున్నట్లు ఓ వార్త షికారు చేస్తుంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రావాల్సి ఉంది.. పాన్ ఇండియా సినిమాల పెరుగుదల తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఎంపిక ప్రమాణాలు మారుతున్నాయి. ఇక ఈ మూవీలో హీరోయిన్ ఎవరినేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ లుక్ మొత్తం మారిపోయింది. ఈ సినిమాలో యోధుడుగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. గుబురు గడ్డం జుట్టుతో కనిపించబోతున్నాడు.. ప్రస్తుతం మహేష్ బాబు కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే లొకేషన్స్ ను కూడా పిక్స్ చేసుకున్న జక్కన్న సినిమాను ఎవరు మొదలు పెడతారో అని మహేష్ బాబు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమాకు ఎన్నేళ్లు తీసుకుంటాడో చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *