దేవర బిజినెస్ మామూలులేదుగా..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దేవర మేనియా కొనసాగుతుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. ఇటు ఫ్యాన్స్.. అటు సినీ లవర్స్ దేవర ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక విడుదలకు ముందే రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా, మంచి వసూళ్లు కూడా రాబడుతోంది. ఓవర్సీస్ ప్రీ సేల్స్ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా ఒక మిలియన్ యూఎస్ డాలర్ల మార్క్ దాటి, రికార్డు సృష్టించిన ఈ మూవీ భారీ వసూళ్లను రాబడుతుంది. ఇండియాలో కూడా దేవర మూవీ కాసుల వర్షం కురిపిస్తుంది. విడుదల అవ్వక ముందే రికార్డులు బద్దలు కొడుతుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది..

 

దేవర బిజినెస్ డిటైల్స్..

 

ఈ సినిమా విడుదలకు ముందే భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. అమెరికాలో అయితే దేవర దెబ్బకు అక్కడి హాలీవుడ్ జనాలు కూడా షాక్ అవుతున్నారు. ఇక మన దేశంలో భాషతో సంబంధం లేకుండా అందరు సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిందని తెలుస్తుంది. ఎక్కడ ఎంత రాబాట్టిందంటే?

 

దేవర ఉత్తర అమెరికాలో 9 రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ కిముందే అడ్వాన్స్ బుక్కింగ్స్ రూపంలో 2 మిలియన్ల డాలర్లు రాబట్టింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, కెనెడాల్లో 40 వేల టిక్కట్ల బుక్కింగ్ జరిగిపోయింది. అలా వాటితో మరో 2 మిలియన్ల డాలర్లు వచ్చినట్టే అని తెలుస్తోంది.. అయితే అటు ఆంధ్రా, తెలంగాణాలో కూడా ప్రీ బుకింగ్స్ సేల్ కూడా ఎక్కువగానే జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమా విడుదల అవ్వకముందే భారీగా బిజినెస్ జరగడం పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

 

దేవర అప్పుడే రూ. 500 కోట్లు రాబట్టిందా?

 

Devara’s business is not usual.. just Rs. Did you earn 500 crores?

Devara’s business is not usual.. just Rs. Did you earn 500 crores?

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ వస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇలా ఈ సినిమా విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ఉండడంతో అభిమానులు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుకుంటున్నారు. ఈ సినిమాకు ఇప్పటివరకు రూ. 400 కోట్ల బడ్జెట్ అయ్యినట్లు తెలుస్తుంది Devara నిర్మాణానికి 400 కోట్లు ఖర్చయింది.. అన్ని విధాలుగా 350 కోట్ల వరకు రికవరీ వచ్చింది.ఇంకా అన్ని భాషల శాటిలైట్ అమ్మకాల డీల్స్ కావాల్సి వుంది. హిందీ ఓన్ విడుదల మీద నుంచి వచ్చే ఇన్ కమ్ వుండనే వుంది. మొత్తంగా చూసుకుంటే దాదాపు రూ. 500 కోట్లు రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి విడుదల అవ్వకముందే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూల్ చెయ్యడం మాములు విషయం కాదు.. దేవర సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. 1000 రూపాయల చొప్పున దేవర మూవీ బెనిఫిట్ షోల టికెట్లు అమ్ముడవుతున్నాయని సమాచారం అందుతోంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *