మీకు ఆ దమ్ముందా? : అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.

 

ఇటీవలే జమ్మూలోని ఏడు జిల్లాల పరిధిలో మొదటి విడతలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. 61 శాతం పోలింగ్ నమోదైంది. ప్రశాంత వాతావరణంలో మొదటి విడత పోలింగ్ కొనసాగింది. సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడతల్లో మిగతా నియోకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న విడుదల కానున్నాయి.

 

ఈ నేపథ్యంలో పార్టీలు ముమ్మంగా ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సహా ఇతర పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా రాఔరీ జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొని మాట్లాడారు. అక్కడి ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 

‘కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం విభిన్నంగా మాట్లాడుతున్నాయి. తాము జమ్మూలో అధికారంలోకి వస్తే ఆ ఆర్టికల్ ను పునరుద్ధరిస్తామంటూ ఫరూక్ అబ్దుల్లా పేర్కొంటున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా అది సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో 370 ఆర్టికల్ ను పునరుద్ధరించనీయం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బంకర్ల అవసరం ఇక మీదటలేదు. కారణమేమంటే.. కాల్పులు జరిపే సాహసం ఎవరూ కూడా చేయలేరు. జమ్మూకాశ్మీర్‌లో కేవలం మన దేశ జాతీయ జెండా(త్రివర్ణ పతాకం) మాత్రమే ఎగురుతుంది’ అంటూ అమిత్ షా అన్నారు.

 

‘పాకిస్థాన్ తో చర్చలు జరపాలంటూ కొంతమంది అనవసర ఆసక్తిని చూపిస్తున్నాయి. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే.. ఉగ్రవాదం పూర్తిగా కనుమరుగయ్యేంతవరకు వారితో ఎటువంటి చర్చలు జరుపం. దేశంపై దాడి చేసిన ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేయాలని మీరు (కాంగ్రెస్ ను పరోక్షంగా ఉద్దేశిస్తూ) ఎలా కోరుకుంటారు. భారత్ పై రాళ్లు రువ్వినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం.. వారికి విముక్తి కల్పించం. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *