కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు..!

తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలివే..

 

1. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం

2. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయం

3. కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం

4. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం

5. హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇనిస్టిట్యూట్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం

6. కోర్ అర్బన్ రీజియన్ లో హైడ్రా పని చేస్తుందని పేర్కొన్న కేబినెట్

7. 51 గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలోకి వస్తాయని పేర్కొన్న కేబినెట్

8. ఆర్ఆర్ఆర్ ను ఖరారు చేసేందుకు 12 మందితో కమిటీని ఏర్పాటు

9. మనోహరాబాద్ మండలంలో లాజిస్టిక్ హబ్ కు కేబినెట్ ఆమోదం

10. ఎస్ఎల్బీసీ టన్నెల్ రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు కేబినెట్ ఆమోదం

11. టన్నెల్ పనులకు రూ. 4637 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *