తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్లీ నెయ్యి, జంతువుల కొవ్వు ఉందని నడుస్తున్న వివాదంపై అనూహ్యంగా అమూల్ కంపెనీ స్పందించింది. తిరుమల భగవాన్ బాలాజీ భక్తులకు అందించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని.. ఆ నెయ్యి అమూల్ కంపెనీ పంపిణీ చేసిందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

 

ఈ విషయంపై అమూల్ డైరీ కంపెనీ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తిరస్కరిస్తూ కంపెనీ ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. ” తిరుమల తిరుపతి దేశస్థానానికి అమూల్ కంపెనీ ఎప్పుడూ నెయ్యి సప్లై చేయలేదు అని మేము స్పష్టంగా చెబుతున్నాం,” అని సోషల్ మీడియాలో అమూల్ అధికారకం ప్రకటన జారీ చేసింది.

 

తమ కంపెనీ నెయ్యి ISO సర్టిఫికేషన్ పొందిన ఫ్యాక్టరీలో హై క్వాలిటీ పాల నుంచి తయారు చేయబడుతుందని, చెబుతూ.. ”అముల్ నెయ్యి శుద్ధమైన పాల కొవ్వుత తయారు చేయబడుతుంది. ఈ పాల కొవ్వు నెయ్యి చాలా కఠినంగా క్వాలిటీ చెక్ చేయబడుతుంది. పైగా ఎఫ్ఎస్ఎస్ఏఐ స్టాండర్డ్స్ పాటిస్తూ.. పాల కల్తీ జరగలేదని అన్ని టెస్టుల్లో నిర్ధారణ చేశాకే నెయ్యి తయారు చేసేందుకు ఆ పాలని ఉపయోగిస్తాం. సోషల్ మీడియాలో వస్తున్న టిటిడీకి మేము నెయ్యి సరఫరా చేశామని వార్తలు తప్పుడు సమాచారం. కంపెనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి ఇదే మా సమాధానం.” అని పోస్ట్ లో రాసింది.

 

మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణ రెడ్డి.. గుజరాత్ నేషనల్ డైరీ లేబరేటరీ ద్వారా తిరుమల లడ్డూ, అందులో ఉపయోగించిన నెయ్యిని పరీక్షించినట్లు రిపోర్ట్ చూపించారు. ఈ రిపోర్ట్ లో లడ్డూ తయారీ ఉపయోగించిన నెయ్యి లో పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, చేప నూనె ఉన్నట్లు తేలిందని తెలిపారు.

 

తిరుపల లడ్డూ ప్రసాదంలో కల్తీ వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఒక పిటీషన్ వేశారు. సుప్రీం కోర్టులో కూడా ప్రసాదం కల్తీ నెయ్యికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని హిందువులు, భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని శిక్షించాలని పిటీషన్ దాఖలు అయింది.

 

ఇదంతా జరుగుతుండగా.. రాజస్థాన్ ప్రభుత్వం ఈ వివాదం గురించి రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాల్లో ప్రసాదం క్వాలిటీ చెక్ చేయాలని స్పెషల్ క్యాంపెయిన్ ని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు రాజస్థాన్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ శుద్ధ ఆహార్, మిలావట్ పర్ వార్ పేరుతో ఈ కాంపెయిన్ చేయబోతోంది. ఈ క్యాంపెయిన్ లో రాష్ట్రంలోని 14 ప్రధాన దేవాలయాల ప్రసాదాన్ని క్వాలిటీ చెక్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *