అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే..!

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

 

కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ రెండో తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై సీఎం నేతృత్వంలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దామోదర రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు.

 

సచివాలయంలో జరిగని సమీక్షలో సీఎంతోపాటు మంత్రులు.. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే అంశంపై కసరత్తు చేశారు. ఈ విషయంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

 

ఇక, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని పరిగణలోకి తీసుకోనున్నారు. ఇప్పటివరకు రేషన్ కార్డులను రెండు రకాల ఆదాయ పరిమితుల ఆధారంగా జారీ చేశారు. తాజాగా, ఆదాయ పరిమితిలో మార్పు చేస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ రాలేదు. ఈ విషయంపై కమిటీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో కమిటీ అధ్యయనం చేసింది.

 

ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్ జారీపై పలు మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో వార్షికాదాయ పరిమితి ఆధారంగా తెల్ల రేషన్ కార్డులను ఇచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, అర్బన్ రూ.2 లక్షలలోపు ఆదాయన్ని పరిగణలోకి తీసుకొని కార్డుల జారీ చేశారు.

 

అలాగే భూ విస్తీర్ణం తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి భూమి అయితే 7.5 ఎకరాలలోపు ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు. మరోవైపు గ్రామీణ, అర్భన్ ప్రాంతాలకు వేరువేరుగా ఆదాయ పరిమితులు ఉన్నందున కొత్తగా జారీ చేయనున్న విధివిధానాల్లో పాతవే కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

ఇక, రాష్ట్రంలో 89.96లక్షలమందికి రేషన్ కార్డులు ఉండగా.. ఇందులో 2.1 కోట్లమంది సభ్యులు ఉన్నారు. ఇందులో 5.66 లక్షలు అంత్యోదయ, అన్నపూర్ణ పథకాల కింద 5,416 కార్డులు ఉన్నాయి. తెల్లకార్డు దారులకు 6 కిలోల బియ్యం ఇస్తున్నారు. అన్నపూర్ణ లబ్ధిదారులకు 10 కిలోల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం అందించగా.. అంత్యోదయ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం 35 కిలోల బియ్యం అందజేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *