తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం..

తిరుమల లడ్డూ వివాదం అనేక మలుపులు తిరుగుతోందా? దీన్ని తప్పించుకునే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారా? చంద్రబాబు సర్కార్‌పై తోసేందుకు ప్లాన్ చేస్తున్నారా? తిరుమల లడ్డూ అయోధ్య వరకు వెళ్లిందా? మాజీ టీటీడీ ఛైర్మన్లు, ఈఓలపై చర్యలు తప్పవా? తప్పవనే సంకేతాలు ఇచ్చేసింది చంద్రబాబు సర్కార్.

 

తిరుమలను పవిత్రకు కేరాఫ్‌గా చెబుతారు భక్తులు. అక్కడికి వెళ్లి స్వామిని దర్శించుకుంటే పాపాలు పోతాయన్నది ప్రగాఢ విశ్వాసం. ప్రతీరోజూ వేలల్లో స్వామివారిని దర్శించుకుంటారు. అక్కడ ఏ ఇష్యూ జరిగినా దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో ఉన్న కోట్లాది మంది హిందువులపై దాని ప్రభావం పడుతుంది. ప్రభుత్వాల ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కూడా. ఈ చిన్న లాజిక్‌ను మరిచిపోయారు జగన్.

 

ఐదేళ్ల జగన్ సర్కార్ చేసిన అరాచకాలు ఇప్పుడిప్పుడే ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన మొదలు.. రివర్స్ టెండర్ పేరిట కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. దీన్ని ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోకి తీసుకెళ్లారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు మిగిలాయని చెప్పుకొచ్చారు. గడిచిన ఐదేళ్లు దీనిపై ఒకటే రీసౌండ్.

 

నాలుగైదు రోజుల కిందట తూర్పుగోదావరి వరద ప్రాంతాలను సందర్శించారు జగన్. ఈ సందర్భంగా రివర్స్ టెండర్ గురించి క్లియర్‌గా సామాన్యుడికి వివరించారు. రివర్స్ వెనుక ఇంత అపవిత్రత ఉందని తాము తెలుసుకో లేకపోయామన్నది శ్రీవారి భక్తుల మాట.

 

తిరుమల లడ్డూ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు జగన్, ఆయన టీమ్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డూలు అయోధ్యకు వెళ్లాయి. ఈ ఏడాది జనవరి 20న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. తిరుమల నుంచి అయోధ్య శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా లక్ష లడ్డూలను తయారు చేయించి పంపింది జగన్ సర్కార్. అక్కడ కూడా తిరుమల ప్రసాదంపై మంటలు మొదలయ్యాయి.

 

ఇదిలావుండగా తిరుమల లడ్డూ వ్యవహారంపై లోతుగా టీటీడీ దర్యాప్తు చేస్తోంది. మాజీ టీటీడీ ఛైర్మన్, ఈవోలపై కఠిన చర్యలు తప్పదనే వాదన ప్రభుత్వ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. మరోవైపు తిరుమల లడ్డూపై మరోసారి స్పందించారు సీఎం చంద్రబాబు. తప్పు చేసినవారికి చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలేదన్నారు.

 

పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారన్నారు కాసింత ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. నాసికరమైన మెటీరియల్ వాడారని, కక్కుర్తికీ ఓ హద్దు ఉంటుందన్నారు. శ్రీవారికి అపచారం చేసిన వారికి వచ్చే జన్మకాదని, ఈ జన్మలో పనిష్మెంట్ ఉంటుందని చెప్పకనే చెప్పేశారు.

 

తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో లోతుగా విచారణ చేస్తోందని, బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామన్నారు. దీన్ని తప్పించుకునేందుకు సీబీఐ విచారణ చేపట్టాలంటూ వైసీపీ కొత్త పల్లవిని అందుకుంది.

 

అక్రమాస్తుల కేసులో గడిచిన పదేళ్లుగా మేనేజ్ చేస్తూ వచ్చారు జగన్‌బాబు. లడ్డూ వ్యవహారం సీబీఐకి అప్పగిస్తే సేఫ్‌గా ఉండాలనే ఆలోచన చేస్తోంది జగన్ అండ్ కో. ఆల్రెడీ ల్యాబ్ రిపోర్టు రావడంతో సీబీఐ విచారణ అవసరం లేదని, డైరెక్ట్‌గా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది చంద్రబాబు సర్కార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *