సెక్రటేరియేట్.. సీఎం రేవంత్ చేతుల మీదుగా.. రాజీవ్‌గాంధీ విగ్రహం ఆవిష్కరణ..!

తెలంగాణ సెక్రటేరియేట్ వద్ద మాజీ పీఎం రాజీవ్‌గాంధీ విగ్రహా విష్కరణ జరగనుంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

 

ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. వాస్తవానికి గత నెల 20న రాజీవ్‌గాంధీ జయంతి రోజు సోనియాగాంధీ, రాహుల్ చేతుల మీదుగా ప్రారంభించాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

 

సచివాలయం సమీపంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై అధికార-విపక్షాల మధ్య పెద్ద రచ్చ జరిగింది. రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్ఎస్ అంగీకరించలేదు. ఆ స్థలంలో తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఈలోగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది.

 

తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సెక్రటేరియేట్ బయట కాదు, లోపలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడంతో విగ్రహ రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *